Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

1.6 ప్రాణాయామం | Pranaayaamam

1.6 ప్రాణాయామం

ముద్ర:

ప్రాణాయామ – నాడీ శోధన ముద్ర

ముద్ర విధానం: తరగతి గదిలో ప్రదర్శించిన విధంగా అనుసరించండి.

  • మధ్యవేలిని మడిచి, బొటనవేలి అడుగు భాగంలో ఉంచాలి.

  • ఉంగరపు వేళితో ఎడమ నాసికా రంధ్రాన్ని ( మూయటానికి మరియు తెరవటానికి )

  •  నియంత్రించాలి.

  • బొటనవేళితో కుడి నాసికా రంధ్రాన్ని( మూయటానికి మరియు తెరవటానికి )  నియంత్రించాలి.

  • తర్జని వ్రేలు  ( చూపుడు వ్రేలు )  కనుబొమ్మల మధ్య ఉంచాలి.


ప్రాణాయామ క్రియ

  1. ఎడమ నాసికా రంధ్రాన్ని మూసి, కుడి వైపు నుండి శ్వాస పీల్చాలి.

  2. రెండు నాసికా రంధ్రాలను మూసి, శ్వాసను నిలిపి 
    “ఓం” మంత్రాన్ని 12 సార్లు జపించాలి.

  3. కుడి వైపు మూసి, ఎడమ నాసికా రంధ్రం ద్వారా శ్వాస వదలాలి.

  4. ఎడమ వైపు నుండి తిరిగి శ్వాస పీల్చాలి.

  5. రెండు నాసికా రంధ్రాలను మూసి, శ్వాసను నిలిపినప్పుడు  అయ్యప్ప మూల మంత్రాన్ని 25 సార్లు జపించాలి.

అయ్యప్ప మూల మంత్రం:

మూల మంత్రం:
ఓం ఖ్రూం నమః పరాయ గోప్త్రే  ॥ఇప్పుడు ఎడమ నాసికా రంధ్రాన్ని మూసి ఉంచుతూ, కుడి నాసికా రంధ్రం ద్వారా శ్వాసను బయటకు వదలాలి.ఈ శ్వాసలోని “అయ్యప్ప మంత్ర-శక్తిని” కుడి చేయి గుండ్రటి అరచేతిలో (Cupping Palm) సేకరించాలి.

  1. ఇప్పుడు ఎడమ నాసికా రంధ్రాన్ని మూసి ఉంచుతూ, కుడి నాసికా రంధ్రం ద్వారా శ్వాసను బయటకు వదలాలి.

  • ఈ శ్వాసలోని “అయ్యప్ప మంత్ర-శక్తిని” కుడి చేయి గుండ్రటి అరచేతిలో (Cupping Palm) సేకరించాలి.

  • ఎడమ చేయిని కుడి చేయి క్రింద ఉంచాలి.

  1. ఈ “అయ్యప్ప మంత్ర-శక్తి శ్వాసను” రెండు అరచేతుల మీద రుద్దాలి.

  2. తరగతిలో చెప్పిన విధంగా, వ్యాపకం క్రియను 3 సార్లు (3T) చేయాలి.

  • దీని ద్వారా అయ్యప్ప మూల మంత్ర ప్రాణశక్తిని శరీరమంతా వ్యాప్తి చేయాలి.

📢 Follow