మాపైన నీకింత కోపమేల
యాడున్నావో కళ్లు మూసున్నావో
కానరావా మాకు ఆంజనేయ
|| మౌనమేల ||
నీవే దిక్కని నమ్మి నిత్యము గొలిచెముమా పూజలో నీకు లోపాలు జరిగెనా
నిన్నే నమ్ముకొని బ్రతికున్నామంజన్న
తల్లివి నీవని తండ్రివి నీవని
మదిలోన నీ నామం తలచెము అంజన్న
|| మౌనమేల ||
మండల మాలలు వేసినిండుగా నీ భజన చేసి
గుట్టలెన్నో ఎక్కినాము
దిక్కులెన్నో వెతికినాము
మింగిలో చుక్కల్ని నీ జాడ అడిగాము
ఏడ దాగున్నావో కానరావంజన్న
మాపైన నీకింత కోపమెందుకయ్యా
రామబంటువని నమ్మినామంజన్న
ఇకనైనా మాపైన దయరాదా అంజన్న
|| మౌనమేల ||
కొండగట్టులోన నీవుకొలువుదీరి ఉన్నావంట
ఆ కొండగట్టుకు మేము
నిన్ను చేర వచ్చినాము
కంటినిండా నిన్ను చూసాము అంజన్న
కరుణతోటి మమ్ము కాపాడు అంజన్న
దానధర్మములు చేసెము మా స్వామి
దయున్న అంజన్న దండాలు నీకయ్య
నిండు మనసుతో దీవించు మమ్ములను
|| మౌనమేల ||
కేసరినందన రావాఈశ్వరతేజ రూపా
నిన్నే నమ్ముకున్న వాళ్ళము
మమ్ము మరువబోకు మా స్వామి
పవనకుమార పాపవినాశ
చిరంజీవి మా చింతలు బాపు
భక్తితోడ నిన్ను కొలిచెము అంజన్న
వజ్రశరీర వానరవీర
అతిబలవంత సుందరరూపా
|| మౌనమేల ||