48. నాందీ సమారాధనము | Nandi Samaaradhanamu | Veerashaiva Purohitam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

48. నాందీ సమారాధనము | Nandi Samaaradhanamu | Veerashaiva Purohitam

నాందీ సమారాధనము

ఒక తాబాణము (కంచము)లో బియ్యమును పోసి (నింపి) అందులో నందీశ్వరాది 24 జన ప్రమథుల పేర్లను వ్రాసి, టెంకాయ, అరటి పండ్లు, ద్రాక్షాది ఫలములను తాంబూలమును ఉంచి, 24 దక్షిణములను ఉంచి, దేశాది కాలములను (సంకల్పము)ను జెప్పి,

మంత్రము :- 
“ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అద్య కరిష్య మాణ గర్భాదానాంగ భూతనాందీ శోభన దేవతాముద్దిశ్య నాందీ శోభన దేవతా ప్రీత్యర్థం నాందీ సమారాధనాఖ్యం కర్మ కరిష్యే” అని సంకల్పించి

మంత్రము :- 
“శ్రీ నంది-భృంగి-రిటి-వీరక-వీరభద్ర-పుష్పదంత-అండాభరణ - దండపాణి-చండేశ్వర - దారుక - రేణుక - వికర్ణ - విజయకర్ణ - ఘంటాకర్ణ-గోకర్ణ-రేవణసిద్ధ - మరుళసిద్ధ - ఏకోరామ- పండితారాధ్య- సుకేతు-రురు-ఉపమన్యు-భృగు-దధీచిగౌత-మాది-మహా ప్రమథగణాన్ పురాతన భక్త మహా గణానత్ర ఆవాహయామి || నంద్యాది మహా గణాంస్పాయుధాస్స శక్త యస్సపరివార సమాగత్యాత్ర పూజాం భవంతో గృహ్లంతు ” అని చెప్పి 2 వస్త్రములను గప్పి, పూర్వోక్త ఉపచారములతో పూజించి, తాంబాణం (కంచము)లో ఉంచిన ఆ డబ్బును

మంత్రము :-
 హిరణ్య గర్భగర్భస్థం - హేమబీజం విభావసో | అనంత పుణ్యఫలదమతః శాంతిం ప్రయచ్ఛమే || అనేన హిరణ్యేన నాందీ శోభన దేవతాః ప్రియంతాం ||

అని దక్షిణను మాహేశ్వరులకు దాన మొసంగవలయును. తరువాత 24 మంది వీరమాహేశ్వరులకు భోజనము జేయించి-దక్షిణ - తాం బూలాదులను ఇచ్చి సంతృప్తి పరచవలెను. “ఇది నాందీ”

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow