రాత్రియందు పత్నితోబాటు భద్రపీఠమున గూర్చుండి ప్రాణాయామము నాచరించి, ఫలపూజ నొనర్చవలెను.
ఎట్లనగా :- దేశ కాలదులను బేర్కొని,
మంత్రము :-
“ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ సత్సంతాన సౌభాగ్య ఫలసిద్ధి ద్వారా ఫల దేవతాంతర్యామి శ్రీ సాంబ సదా శివ ప్రీత్యర్థం ఫల పూజాఖ్యం కర్మ కరిష్యే” అని సంకల్పమును పఠించి
మంత్రము :-
మంత్రము :-
“యాః ఫలీ ర్యా అఫలా, అపుష్పాయాశ్చపుష్పిణీః | బృహస్పతి ప్రసూతాస్తా నో ముంచత్వగం హసః ||” ఈ మంత్రంతో ఫల దేవత నాహ్వానించి,
“ఫల దేవతాభ్యోనమః” అను నామ మంత్రము చేత అష్టోత్తర శతార్చనతో పూజించి,
మంత్రము :-
“ఫల దేవతాభ్యోనమః” అను నామ మంత్రము చేత అష్టోత్తర శతార్చనతో పూజించి,
మంత్రము :-
“అనయా పూజయా భగవాన్సర్వాత్మక శ్రీ సాంబసదా శివ సుప్రీతస్సుప్రసన్నో వరదో భవతు ||” అని ఉచ్చరించి తర్పణమును వదలవలెను. (సమర్పించవలెను) తదుపరి,
మంత్రము :-
మంత్రము :-
“విష్ణుర్యోనింకల్పయతు త్వష్టా రూపాణిపిగ్ంశతు | ఆసించతు ప్రజాపతిర్థాతా గర్భందధాతుతే | గర్భంధేహిసినీవాలి, గర్భంధేహి సరస్వతి | గర్భంతే అశ్వినౌ దేవావధత్తాం పుష్కరస్రజా | హిరణ్మయీ అరణియన్నిర్మంథతో అశ్వినౌ | తంతే గర్భగ్ం హవామహే దశమేమాసిసూతవే | యథేయం పృథ్వీ మహీతిష్ఠంతి గర్భమాదధే ఏవంతం గర్భమా ధేహి దశమే మాసిసూతవే | యథాపృథివ్యగ్ని గర్భాద్యౌర్యథేంద్రేణ గర్భిణీ వాయుర్యథా దిశాం గర్భ ఏవ గర్భం దధాతుతే | విష్ణోః శ్రేష్ఠైన రూపేణాస్యాం నార్యాంగవీన్యాం | పుమాంసం గర్భమాధేహి దశమేమాసిసూతవే | నెజమేష పరాపత సుపుత్రః పునరాపత | అస్యైమే పుత్రకామాయై గర్భమాధేహియఃపుమాన్ | వ్యస్య యోనిం పతిరేతో గృహాణపుమాంపుత్రోధీయతాం | గర్భే అంతఃతం మాతా దశమాసోబి భర్తు సజాయతాం వీరతమస్వాం అతగర్భ్యోయోనిమేతుపుమాన్యాణ ఇవేషుధిం | అ వీరోజాయతాం పుత్రస్తే దశమాస్యః కరోమితే ప్రాజా పత్యమా గర్భోయోనిమేతుతే అనూనః పూర్ణోజాయతామశ్లోణో పిశాచ భీతః | పుమాగ్ంసై పుత్రోనారితం పుమాననుజాయతాం | యాని భద్రాణి బీజాన్యృషభాజనయంతినౌ | తాని భద్రాణి బీజాన్యృషభాజనయంతినః | తైస్త్వ౦ పుత్రాన్విందస్వసాప్రసూరేను కాభవ | కామః సమృద్ధ్యతాం మహ్యమపరాజిత మెవమె | యం కామంకామయే దేవతం మేవాయో సమర్థయ ||”
అని గర్భా ధాన సూక్తమును జపించి, పత్నిని ముట్టి అభిమంత్రించి
మంత్రము :-
అని గర్భా ధాన సూక్తమును జపించి, పత్నిని ముట్టి అభిమంత్రించి
మంత్రము :-
“ఫలం మనోరథ ఫలం ప్రదదాతి సదా నృణాం | పుత్ర పౌత్రాభి వృద్ధ్యర్థం అత శాంతిం ప్రయచ్ఛమే || ఇదం ఫలదానం సదక్షిణాకసతాంబూలం శ్రీ సాంబ సదా శివ ప్రీతింకామయ మానస్తు భ్యమహంసంప్రదదే నమమ నమమ ||”
అని చెప్పి, మాహేశ్వరులకు ఫలదాన మొసంగవలెను.
మాహేశ్వరులు :-
అని చెప్పి, మాహేశ్వరులకు ఫలదాన మొసంగవలెను.
మాహేశ్వరులు :-
“ఉభయో సత్సంతాన సౌభాగ్య ఫల సిద్ధిరస్తు” అని ఆశీర్వదించవలెను. అనంతరము పత్నితో సంభోగించవలెను. (ఋతు మతి యైన నాలుగవ దినము మొదలుకొని సమదినములు సంతానదాయకములు).
(ఇది గర్భాధాన విధి)
(ఇది గర్భాధాన విధి)