Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

59. ఎక్కడ లేడమ్మా స్వామీ, ఎక్కడ లేడమ్మా | Ekkada Ledamma Swamy | వేంకటేశ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
ఎక్కడ లేడమ్మా స్వామీ, ఎక్కడ లేడమ్మా
వెళ్ళి చూస్తే తిరుమలలోనా
వెతికి చూస్తే నీ మదిలోనా

నిరతము మదిలో తలచే వారికి
నిక్కముగా మది నమ్మిన వారికి
సర్వము తానై కొలిచే వారికి
సకలము తానని నమ్మే వారికి
||ఎక్కడ లేడమ్మా||
అందరిలోనా కొలువున్నాడు
అగుపడక తానున్నాడు
తలచిన వారి హృదయములోనా
చక్కగా తాను కొలువున్నాడు
||ఎక్కడ లేడమ్మా||
స్వామీ భజనలు చేసే వారికి
స్వామీ పాటలు పాడే వారికి
స్వామికి సేవలు చేసే వారికి
సర్వము తానై పిలిచే వారికి
||ఎక్కడ లేడమ్మా||
సదా నామము మరువని వారికి
సదా చింతనతో గడిపే వారికి
నియమముగా ధ్యానించే వారికి
నిజ భక్తితో సేవించే వారికి
||ఎక్కడ లేడమ్మా||
పరజీవులను ప్రేమించే వారికి
పరులతో ద్వేషము లేని వారికి
పద్ధతి కలిగి ఉండే వారికి
పరమ పథమును కోరే వారికి
||ఎక్కడ లేడమ్మా||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow