మా గుండెలో నిలిపితిమయ్యా మా ధైర్యం నీవేనయ్యా
జై జై శ్రీరామంటూ జగమంతా పలికెను చూడు
శివుని విల్లుని విరిచి సీతమ్మను పరిణయమాడి ||2||
వీరాధి వీరుడవయ్యా రఘువంశ రాముడవయ్యా ||2||
జై జై శ్రీరామంటూ జగమంతా పలికెను చూడు ||2||
అయోధ్య నగరములోనా అందాల దేవుడవయ్యా ||2||
తండ్రి మాటకై నీవు అడవులకే వెళ్ళినావు ||2||

ధర్మ మార్గమును చూపి సత్య మార్గమున నడిపి ||2||
రాజా రామ శరణం నీ పాదాలికే విడవం ||2||

కస్తూరి తిలకం దిద్ది కాషాయం జెండా పెట్టి ||2||
ఎత్తర ఎత్తర జెండా రామాంజనేయులే అండా ||2||

మా గుండెలో నిలిపితిమయ్యా మా ధైర్యం నీవేనయ్యా ||2||
జై జై శ్రీరామంటూ జగమంతా పలికెను చూడు.