వెంకటాద్రి సమం స్థానం
బ్రహ్మాండే నాస్తి కించన |
వెంకటేశ సమో దేవో
న భూతో న భవిష్యతి ||
దేవా దయ చూడవా తిరువెంకటేశ్వరా
పాహి పరంధాముడా శ్రీ పద్మనాభుడా ||2||
దేవా దయ చూడవా ఆ.. ఆ..
పరి పరి విధముల ప్రార్థించుచున్నాను
పరమానందా పాహి ముకుందా ||2||
కోరస్: పరమానందా పాహి ముకుందా
కరుణాభరణా సంకట హరణా
భారము నీదే భవ భయ హరణా
కోరస్: భారము నీదే భవ భయ హరణా
దేవా దయ చూడవా తిరువెంకటేశ్వరా
పాహి పరంధాముడా శ్రీ పద్మనాభుడా
దేవా దయ చూడవా..
ఆదియు నీవయ్యా అంతము నీవయ్యా
అఖిల జగతిలో నిండియున్నావయ్యా ||2||
కోరస్: అఖిల జగతిలో నిండియున్నావయ్యా
నిర్మల రూపా నిఖిల జనావనా
నిన్నే నమ్మితి శ్రీ లక్ష్మీ హృదయేశా
కోరస్: నిన్నే నమ్మితి శ్రీ లక్ష్మీ హృదయేశా
దేవా దయ చూడవా తిరువెంకటేశ్వరా
పాహి పరంధాముడా శ్రీ పద్మనాభుడా
దేవా దయ చూడవా ఆ.. ఆ..
