Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

92. శివుడవేనీవనుచు సేవించనా | Shivudave Neevanuchu sevinchana | శివ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
సాకి:
గగణసీమలలోని ఓ మేఘమాల
ఈ భువిలోనవిరసిన మంధార మాల
భక్తులహృదయాన విలశిల్లెడు
కవితలలిత వనమాల ...
నారాయణా ...
శివనారాయణా... ఆ...ఆ...

పల్లవి:
శివుడవేనీవనుచు సేవించనా
నారాయణుడవనుచు భావించనా
శివకేశవుడవనుచు ధ్యానించనా
భాలయోగీనిన్ను ఏమనుచు కొలవాలి.
శివుడవేనీవనుచు సేవించనా
నారాయణునుడవనుచు భావించనా

చరణం 1:
అవధూతవోనీవు అవతారమూర్తివో
అవనిలోవెలిగేటి ఆనందజ్యోతివో
దైవరూపానివో సత్యదైవానివో
భాలయోగీనిన్ను ఏమనుచుకొలవాలి.
శివుడవేనీవనుచు సేవించనా
నారాయణుడవనుచు భావించనా

చరణం 2:
ఏపూర్వపుణ్యమో ఈ జన్మ లోమాకు
నిన్నుసేవింపగా మనసిచ్చినావయ్య
నీసేవచేసినా భాగ్యమెభాగ్యము
నినుకొలిచేవారికి జన్మయేధన్యము.
శివుడవేనీవనుచు సేవించనా
నారాయణుడవనుచు భావించనా
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow