Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

93. అయ్యా నీ గుడిలో వెలిగే దీపానైపోనా | Ayya nee gudilo velige | శివ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
అయ్యా నీ గుడిలో వెలిగే దీపానైపోనా
మల్లన్న పాదపూజకై పూవుగా మారనా
శరణమయ్యా మల్లన్న స్వామి శరణమయ్యా
శరణమయ్యా మల్లన్న స్వామి శరణమయ్యా

నిన్ను చూడగా నోచుకొని నీ కన్నులెందుకయ్యా
నిన్ను పూజించే భాగ్యం లేని చేతులెందుకయ్యా
నీ నామాన్నే పలుకలేని నాలుకెందుకయ్యా
నీ సన్నిధికే చేరలేని కాళ్లెందుకయ్యా
నిన్ను స్మరించే అర్హత లేని ఈ జన్మ ఎందుకయ్యా
||అయ్యా నీ గుడిలో||
సిరి సంపదలు కలిగిననాడు గర్వముతో ఉంటే
సర్వం పోయిన తరువాతే నీ మాల వేసుకుంటే
పైపై మెరుగులతో నేనే మురిసిపోయి ఉంటే
అంతులేని వ్యాధులతో ఇప్పుడు నిన్ను చేరుకుంటే
పాపకూపమున మునిగిపోయితిని చేరదీయమంటే
||అయ్యా నీ గుడిలో||
నమ్మిన వారిని వమ్ము చేయవని నిన్ను నమ్ముకుంటే
అహంకారమే విడచి ఆర్తిగా శరణు వేడుకుంటే
దీనుడనైన దిక్కు నీవని నిన్ను మ్రొక్కుతుంటే
తప్పులన్నీ మన్నించి తప్పక కరుణ చూపుమంటే
కన్నతండ్రివై కనికరించి కాపాడరమంటే
||అయ్యా నీ గుడిలో||
శరణం శరణం మల్లన్న స్వామి శరణం మల్లన్న
శరణం శరణం మల్లన్న స్వామి శరణం మల్లన్న
శరణం శరణం మల్లన్న స్వామి శరణం మల్లన్న
శరణం శరణం మల్లన్న స్వామి శరణం మల్లన్న ॥
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow