Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

61. ఎలుక వాహన ఏనుగు రూపా | eluka vahana enuguroopa | వినాయక భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
విజయమణికంఠ భజన బృందం, ఒంగోలు వారు సమర్పిస్తున్న వాల్యూం నెం. 1.

ప్రార్థన

శ్రీ విఘ్నరాజ! సురసేవిత! భానుతేజ!
నీ నామగానం సదా మది పాడువే।
ఆనందమందు విఘ్నపాపములంతరించు,
శ్రీ గౌరీపుత్ర! నీ స్తోత్రము సిరినిగు మోజి॥

Lyrics:

ఎలుక వాహన ఏనుగు రూపా,
బొజ్జా గణపయ్యా! మమ్ములను బ్రోవగ రావయ్యా॥2॥

పిండి బొమ్మగా పుట్టితివయ్యా,
ఇహపర పూజలు నీకయ్యా॥2॥
పార్వతీ తనయ! పాప వినాశక!
భక్తులను బ్రోవగ రావయ్యా।
భావన నేనూ మా వచనమయ్యా,
మమ్ములను కాపాడ రావయ్యా॥

కాణిపాకమున జల విఘ్నేశ్వరా,
కరుణతో మమ్ము బ్రోవుమయ్యా॥2॥
కాణిపాకమునకు వచ్చే భక్తుల
చల్లగా చూడయ్యా।
నిలువ ఏనుగుల వలె మమ్ములను
నిలపవయ్యా, మమ్ములను కాపాడ రావయ్యా॥

శ్రీశైలంలో సాక్షి గణపతిగా
సకల శుభములను ఇయ్యవయ్యా॥2॥
శ్రీశైలమునకు వచ్చే భక్తులను
చల్లగా చూడయ్యా।
ఎలుక వాహన ఏనుగు రూపా,
వచ్చి గణనాథా! మమ్ములను బ్రోవగ రావయ్యా॥

పంబా తీరాన కనిమూల గణపతి,
పావన రూపం నీవయ్యా॥2॥
ఎరుమేలికి వచ్చే భక్తులందరిని
చల్లగా దీవించయ్యా।
ఎదువానవయ్యా,
మమ్ములను త్రోవ చూపవయ్యా।
మమ్ములను త్రోవ చూపవయ్యా,
మమ్ములను బ్రోవవయ్యా॥

యూట్యూబ్ లింక్ :
https://youtu.be/38f14ALc-iw?si=m2dNmRZG2Av6M3_Q
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow