Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

238. నీ మాల వేసినాము, నియమాలతో ఉన్నాము | Nee Maala Vesinaamu Niyamalatho | అయ్యప్ప భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
నీ మాల వేసినాము, నియమాలతో ఉన్నాము
నలభై ఒక్క రోజులు వ్రతమాచరించాము
ఇరుముడులు కట్టుకోండయ్య స్వాములు
శబరిమలకి చేరరారయ్య అయ్యప్పలు॥
(నీ మాల వేసినాము, నియమాలతో ఉన్నాము॥)
🙏 కార్తీక మాసాన అయ్యప్ప దీక్షలు,
నియమ నిష్ఠలతోటి ఘనమైన పూజలు।
శరణుఘోష పలకరేమయ్య స్వాములు,
శరణమంటే పలుకుతాడయ్యా మణికంఠుడు॥
(నీ మాల వేసినాము, నియమాలతో ఉన్నాము॥)
🙏 ఎరుమేలి చేరాలి, వావరికి మొక్కాలి,
ఎరుకల కోయ వేషమేసి పేట తుళ్ళి ఆడాలి।
పేట తుళ్ళి ఆడరారయ్య స్వాములు,
కులమతాలు మనకు లేవయ్యా అయ్యప్పలు॥
(నీ మాల వేసినాము, నియమాలతో ఉన్నాము॥)
🙏 పంబలోన స్నానమాడి గణపతికి మొక్కాలి,
పద్దెనిమిది మెట్లెక్కి అభిషేకం చేయాలి।
మకర సంక్రాంతి నాడు స్వాములు,
జ్యోతిగా కనిపించెను మణికంఠుడు॥
(నీ మాల వేసినాము, నియమాలతో ఉన్నాము॥)
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్పా 🙏
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow