ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప
దశ దిశాంతాలలో... ఆ దిగాంతాలలో...
భూ భువనాంతరాలలో... మన అంతరాలలో...
ఎక్కడ చూసినా నీవే అయ్యప్ప
సర్వాంతర్యామి నీవే అయ్యప్ప
స్వామి శరణం అయ్యప్ప శరణం
శరణం శరణం అయ్యప్పా
స్వామియే శరణం అయ్యప్పా
"ఎక్కడ"
చిగురాకులలో పూవులలో నీవే అయ్యప్పా
పసి పాపలలో వృద్ధులలో నీవే అయ్యప్పా
ప్రతిధ్వనించే పవిత్ర నామం నీవే అయ్యప్పా
ప్రజ్వరిల్లే స్వర్ణ రూపం నీవే అయ్యప్పా
నీలో నాలో నాలో నీలో
అన్నిటా అంతట అక్కడ ఇక్కడ
" ఎక్కడ "
రివ్వు రివ్వున వీచే గాలిలో నీవే అయ్యప్పా
గల గల గల గల పారే నీటిలో నీవే అయ్యప్పా
గణ గణ గణ గణ మ్రోగే గంటలో నీవే అయ్యప్పా
డమ డమ లాడే డమరు ధ్వనిలో నీవే అయ్యప్పా
రాతిలో నాతిలో మానవ జాతిలో
సకల చరాచర జీవ రాశిలో
"ఎక్కడ"
డమ డమ లాడే డమరు ధ్వనిలో నీవే అయ్యప్పా
రాతిలో నాతిలో మానవ జాతిలో
సకల చరాచర జీవ రాశిలో
"ఎక్కడ"
గల పారే సెలయేరులలో నీవేన అయ్యప్ప.
ఆ ఏటిలో ఉండే జీవ జలములో నీవేన అయ్యప్ప
అండ పిండ బ్రహ్మాండ మంతయు నీ సృష్టేనయ్య
నువ్వు లేని చోటు ఎక్కడా లేనే లేదయ్యా
అభిషేకించే పాలల్లోన నువ్వేనయ్యప్ప.
ఆ పాలను ఇచ్చే గోవుల్లోన నువ్వేనయప్ప