గణములకు అధిపతివి గణపతి
గణములకు అధిపతి వి గణపతి
నీవు బ్రహ్మ సృష్టి కే మారుగా జన్మించితివి
నలుగు పిండితో మలచేను అమ్మ పార్వతి
నీ చరితము విన్న కలుగును మాకు సక్కతి...
తొలి సంధ్యలో కొలుతు నిన్ను ఆది గణపతి
మలిసంధ్యలో పూజింతును మహాగణపతి
అనుదినము పూజింతును అష్ట గణపతి
భక్తితో న కోలుతు నిన్ను ముక్తి గణపతి
విధ విధముగా పూజింతును విద్యా గణపతి
లక్షపత్రి తో కొలుతును లక్ష్మీ గణపతి
నయనము తో కొలుతు నిన్ను నాట్య గణపతి
క్షీరాభిషేకం అయ్యా క్షేత్ర గణపతి
మను గొప్పగా పూజింతును నిన్ను బాల గణపతి
నిర్వివిధముగా పూజింతును వీర గణపతి
మనమున నిన్ను ధ్యానంతుము మహా గణపతి
నిత్యము నిన్నే కోలుతుము నిత్య గణపతి
దర్శనం మొదలు నీవే పుణ్య గణపతి
దర్శనమిచ్చే తండ్రి దివ్య గణపతి
స్తుతియింతును నిన్ను నేను సూక్ష్మ గణపతి
పొగి డె దము నిన్ను మేము కాల గణపతి
దేహి అని పూజింతుము దేవ గణపతి
మోక్షము నొసగే తండ్రి మోక్ష గణపతి