శబరి కొండపై వెలిసిన అయ్యప్పా
శబరి కొండపై వెలిసిన అయ్యప్పా
నీ అండ దండ మాకుండాలని
కొబ్బరి కాయలు పూలు పండ్లు
పలహారములే తెచ్చితిమయ్యప్పా
" శబరి కొండపై "
భవ బంధాలను వీడామయ్య భక్తితో నిన్నే కొలిచామయ్యా
మండల వ్రతమే చేసామయ్యా మదిలో నిన్నే తలచామయ్యా
ఎరుమేలి వాసా ఏకాంత వాసా...
ఎరుమేలి వాసా ఏకాంత వాసా ఏమని నిన్ను కొలిచేమయ్యప్పా
" శబరీ కొండపై "
ఐదు కొండలు దాటోచ్చాము ఎండవానలకు మేమొచ్చాము
నీ నామమునే పలుకుతూ రాగా నీ పాటలనే పాడుతూ రాగా
పంపా వాసా పందల రాజా...
పంపా వాసా పందల రాజా పాపాలను కదా తీర్చగా రావయ్యా
" శబరి కొండపై "
పాలాభిషేకం పూలాభిషేకం తేనభిషేకం భాస్మభిషేకం
నేయ్యభిషేకం చేసామయ్యా జ్యోతిగా దర్శనమిచ్చినవయ్యా
జగములనేలే ఓ శబరీశా ...
జగములనేలే ఓ శబరీశా జన్మ ధన్యము చేయగా రావయ్యా
" శబరి కొండపై "