శబరికొండలలో ఆ బంగరు కోవెలలో ||2||
వెలసితివా ఆ శిఖరముపైకి జ్యోతి స్వరూపముతో ||2||
శిలగా వెలిశావే మా దేవుడవై నావే ||2||
||శబరి కొండలలో||
తులసి మాలను మెడను ధరించి
ఇరు సంధ్యలలో స్నానము చేసి ||2||
పూజలు చేశామే నీ భజనలు చేశామే ||2||
||శబరి కొండలలో||
స్వామి శరణమే జప మంత్రముగా
విషయ వాసనలు తృణ ప్రాయముగా ||2||
సాధన చేశామే నీ భక్తులమయ్యామే ||2||
||శబరి కొండలలో||
ఇరుముడి మూటను శిరమున దాల్చి
వావరు స్వామిని తోడుగా చేసి ||2||
త్రోవను చూపావే మా గమ్యము చేర్చావే ||2||
||శబరి కొండలలో||
పంబా నదిలో స్నానము చేసి
పదునెట్టాంబడి
అధిరోహించి || 2||
దర్శనమోంద్యామే
నీ ధన్యత పొంద్యామే ||2||
||శబరి కొండలలో ||