స్వాములారా మీరు రండి / Swamulara Meru randi - అయ్యప్ప భజన పాటల లిరిక్స్

స్వాములారా మీరు రండి భక్తులారా మీరు రండి
పరశురామ క్షేత్రమునకు పాదయాత్ర
 పంబ నది తీరాన  ఉన్న శబరి యాత్ర


కార్తికేయ క్షేత్రములో మాల వేసి దీక్షబూని
జంట ముడులు కట్టుకొని పాదయాత్ర
భక్తిని వెంట పెట్టుకొని పాదయాత్ర



ఎరుమేలిలో పేట తుల్లి వావరు స్వామి దీవెనలంది
రాయి రప్పల పూలపాన్పు లై పంచగిరిషుని పాదయాత్ర
మన పంచగిరిషుని పాదయాత్ర.


పంబా నదిలో స్నానమాడి పరమ పావ నుని దర్శించ
అష్టాదశ సోపానమునకు పాదయాత్ర
జ్యోతి స్వరూపుని చూడ పాదయాత్ర


అక్కడ చూస్తే అయ్యప్ప స్వామి ఇక్కడ చూడ అయ్యప్ప స్వామి
అక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా అయ్యప్ప స్వామి
మన హృదయంలో కొలువున్న అయ్యప్ప స్వామి....

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!