అయ్యా దర్శనం స్వామి అయ్యా దర్శనం
బంగారుకొండపైన అయ్యా దర్శనం
రాయి రప్పుల్లో అడవిముళ్ళబాటల్లో
అలసి ఉల్లాసంగా నీకై మేము వచ్చినామయ్య ||2||
స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప
||అయ్యా దర్శనం||
దివ్యమైన నీవ్రతంతో మాలవేసి
మొక్కుబడి మూటకట్టి వస్తున్నామయ్యా ||2||
పంపలో స్నానంచేసి పాపాలు వదిలి
సేవచేస్తూ పాటలు పాడి వస్తున్నామయ్యా ||2||
ఎక్కుట కష్టము కొండ ఎక్కుట కష్టము
నీచేయికాచి కరిమల నీలిమల ఎక్కించాలయ్యా
స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప
||అయ్యా దర్శనం||
నీ సోపానలెక్కివచ్చి మొక్కెమయ్యప్ప
మొదటి మెట్టున కొబ్బరికాయ కొట్టినామయ్యా ॥ 2॥
పద్దెనిమిది మెట్లు కంటికి అద్దుకొని
సన్నిధానంలో నిన్నే కొలిచేమయ్యప్ప ||2||
దోషం పోగొట్టి స్వామి మోక్షం ఇవ్వయ్యా
స్వామి కన్నుల వెన్నెల జల్లులతో కావగ రావయ్యా ||2||
స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప
||అయ్యా దర్శనం||