పల్లవి: చండా ప్రంచడుడే పిండిబొమ్మ అతడే
పార్వతీదేవికి ప్రియమైన పుత్రుడే
||చండా|| |
అంబజగదాంభ తానమాడేవేళ ||2||
నలుగు పిండి బొమ్మజేసి జీవంబుపోసెను ||2||
||చండా||
పరమేశు నెదిరించి ప్రాణాలు విడిచెను
ఆతండ్రి దయతోనే పునర్జన్మ పొందెను ||2||
||చండా||
గజాసురుని సిరము అలంకారమాయెను ||2||
లోకాలు పూజింప గణణాధుడాయెను ||2||
||చండా||