పచ్చ పచ్చాని చెట్టురా
పచ్చపచ్చని చెట్టురాచెట్టు మీద రామచిలుకరా ||2||
రామచిలక నోట ఎల్లవేలలా
స్వామి నామమే పలుకురా
నీ స్వామి నామమే పలుకురా
||పచ్చపచ్చ!!
ఒకానొక రోజున చిలక నిసెంత కొచ్చెరా
స్వామి స్వామి అంటూ నన్ను పేరు పెట్టి పిలువ సాగెరా
ఎటమ్మ చిలకమ్మ ఏటని అడిగితే...... ||2||
ఆకుల్లో తల పెట్టి ఎక్కెక్కి ఏడ్చింది
|పచ్చపచ్చ!!
చింతలేక చెట్టు పైన చిలకగోరింకలైన
ఊసులాడుకుంటూ ఈఊరేమరిచి పాయినవి.
అట్టి ఆ జంటను బోయవాడు చూసెను
చిలకమ్మను చూసి విలుఎక్కుపెట్టెను
అది జూసి గోరింక చిలుక కడ్డువచ్చెరా
గోరింక కంటికి గాయమైనదిరా
గోరింక కంటిచూపు చిలకకు కరువాయెరా...
||పచ్చపచ్చ||
గాయమైన గోరింకకు అన్ని తానైనది
తనకంటితోనే లోకాన్ని చూపుతున్నది
రామచిలుక ఒకనాడు స్వామి పూజచూసెను
పూజలోన గురుస్వామి మహమలెన్నో చెప్పెను
నడవలేనివారు కొండనడిచి వెళ్లారని
మాటరాని వారు పాట పాడుతున్నారని
చూడలేని వారు జ్యోతి చూచుచున్నారని
||పచ్చపచ్చ
అట్టియా రామ చిలక స్వామి మాల వేయమని,
నన్ను వేడుకున్నది బ్రతిమిలాడుతున్నది
మండల వ్రతమును యరుక చేతునని
తన ఇరుముడిని నా తల పైన ఉంచమని
ఇరుముడిలోన తనుగోరింక వచ్చునని
మహిమల మణికంఠుని కనులారగాంతునని
ఆ జ్యోతి దర్శనం గోరింకకు చూపమని
||పచ్చపచ్చ