శ్రీలక్ష్మి నీ మహిమలో - Sri laxmi Ne Mahimalu - భజన పాటల లిరిక్స్

P Madhav Kumar

 శ్రీలక్ష్మి నీ మహిమలో గౌరమ్మ చిత్రమే దోచెనమ్మ గౌరమ్మ
మహాలక్ష్మి నీ మహిమలే గౌరమ్మ చిత్రమై తోచెనమ్మ గౌరమ్మ ||2||


1. భారతీసతివైయి! బ్రహ్మకిల్లాలివై పార్వతిదేవివై, పరమేశురాలివై
పరగ శ్రీలక్ష్మివమ్మొ గౌరమ్మ, భార్యవైతివి హరికివే గౌరమ్మ
                                                       ||శ్రీలక్ష్మి

2. ఏన్నెన్నిరూపములు, ఏడేడు లోకాల వున్న జనులకు
కొంగుబంగారమై కన్నతల్లీవైతివే గౌరమ్మ కామధేనువైతివే గౌరమ్మ
                                                     ||శ్రీలక్ష్మి!!

3.  ముక్కోటి దేవతలు చక్కానీకాంతలు ఏక్కూవా నీనుగుర్చి
పెక్కునోములు నోమిరి గౌరమ్మ ఈ లోకములందుండిరీ గౌరమ్మ
                                                     ||శ్రీలక్ష్మి!

4. తమకంటే ఎక్కువ దైవము ఎవ్వరు లేరు తమకింపు గుర్తింప
సకలలోకంబలో క్రమముచే పలించగా గౌరమ్మ కన్నుల పండుగాయే గౌరమ్మ
                                                     ||శ్రీలక్ష్మి!

5. నిగనిగాయనేటి నగుమోముతోజూపి జగతి పున్నమినటి
చంద్రునిఒడించు సొగసైన నీతిలకమే గౌరమ్మ చూచితే అనందమే గౌరమ్మ
                                                    ||శ్రీలక్ష్మి

6. రత్నాల జపమాల రాజహరంబులూ ముత్యాల పగడాలు
మణిమాణిక్యాలు దరియిస్తివే గౌరమ్మ ముద్దుమంగళసూత్రమే గౌరమ్మ
                                                     ||శ్రీలక్ష్మి

7. నల్లవరి బియ్యము మల్లె మొగ్గలవలె తెల్ల వజ్రంబులూ
ముల్లోకములనేలే తల్లినిదంతములే గౌరమ్మ దానిమ్మ బీజంబులే గౌరమ్మ
                                                      ||శ్రీలక్ష్మి

8. తొమ్మిది దినమూలు నెమ్మనంబునపొంగి అమ్మలక్కలు గూడి
ఆస్తిలో తమకున్న సొమ్ములను దర్శించుగా గౌరమ్మ శోభనంబని పాడిరీ గౌరమ్మ
                                                       ||శ్రీలక్ష్మి!

 9. బంగారు పువ్వులు బతకమ్మలను పేర్చి మంగళంబున నిన్ను మధ్య
నానిలిపీలి రంగు గుమ్మడి పూవులే గౌరమ్మ రాసిగాఅర్పింతుమే గౌరమ్మ
                                                      ||శ్రీలక్ష్మి!

10. గట్ల పుష్పంబులూ తామరపూవులు కాలగొట్టపుపువ్వూలు గన్నెరూ | పువ్వూలు లిల్లి పువ్వులు జల్లుచూ గౌరమ్మ పొగడ పువ్వులు నింపుచు గౌరమ్మ
                                                       ||శ్రీలక్ష్మి!!

11. పన్నీరు అత్తారు పచగంధంబును పరిమళంబులు బుక్క
బారైనకస్తూరి పసుపుకుంకుమ గుప్పుచు గౌరమ్మ పాటలెన్నో పాడిరీ గౌరమ్మ
                                                       ||శ్రీలక్ష్మి!!

12. నూటొక్క పువ్వులు కోటినోములు నోమి నీటుగా కాంతలు
ఆటపాటలతోను మాటికి నిను మెచ్చగా గౌరమ్మ మంగళరతులు పాడిరే గౌరమ్మ
                                                        ||శ్రీలక్ష్మి

13. కోరి ఈరీతిగా కలిపూజింతురూ చారుసుందరమైన
సౌభాగ్యములనిచ్చి కారున్యములనేలవే గౌరమ్మ కల్పాయు నోసగము గౌరమ్మ
                                                        ||శ్రీలక్ష్మి!!

14. పారిజాతంబూలు పగిడితంగేడి పువ్వూలు గోరింటపున్నేలు
కురువింద మల్లేలు తీరు రుద్రాక్షపూలే గౌరమ్మ పేరైన కనకాబ్రాలే గౌరమ్మ
                                                          ||శ్రీలక్ష్మి

15, పాలుమీగడలఅటు పానకంబున జున్ను పోలేలు మరిమడుగు
పూరీలుసేమియాలు మేలు చక్కెర గరిజలే గౌరమ్మ మెప్పుగా అరిపింతుమే గౌరమ్మ
                                                         | |శ్రీలక్ష్మి

16. గంగనర్మద యమున కావేరి సరియు తుంగబద్రాది
ముచుకుందనది తీరమున పొంగివేడుకచేయగా గౌరమ్మ పురుషులు స్త్రీలుకూడి గౌరమ్మ
                                                           ||శ్రీలక్ష్మి

17. నూటక్కపువ్వూలు కోటినోములు నోమి నేరుగా కాంతలు
ఆటలపాటలతోటి ఘనముగా నీ పూజలే గౌరమ్మ భక్తితో మెము సేతుమే గౌరమ్మ
                                                          ||శ్రీలక్ష్మి

18. పాడినావారికి పాటవినువారికి జోడుపల్లాకీలు మేలుజాతి గుజ్రాల
చూడసొంపగు గజములు గౌరమ్మ వేడుకాతోనిచ్చునూ గైరమ్మ ||శ్రీలక్ష్మి!!

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat