మణికంఠుడి 'మణి'

P Madhav Kumar
మణికంఠుడి కంఠమునందున్న 'మణి'ని గూర్చి హరి, హరులు ఇరువురూ కలసి, పసిబాలుడి గా ఉన్న మణికంఠుడుని పంపానదీ తీరంలో విడచి పెట్టడం కోసం భూలోకంలోని పంపానదీ తీరానికి చేరుకున్న ఆ సమయంలో, శ్రీమన్నారాయణుడు ఆ పసిబాలుని (మణికంఠుని) కంఠమునందు ఒక మణిని కంఠాభరణముగా ఆలంకరిస్తాడు.
ఆ మణి దేవమణి. అది మహిమలు కలిగిన మణి. ఆ మణి పేరు చింతామణి. శ్రీమన్నారాయణుడు "చింతామణి"ని మణికంఠునికి
అలంకరించడంలోని ఆంతర్యం ఏమిటి? మహిషిని సంహరించడం కోసం మణికంఠుడు భూలోకంలో 12 ఏండ్లు వసించాలి.
ఆ 12 ఏండ్ల కాలంలో “మణికంఠుడు” ఏది కోరితే అది జరగడం కోసం చింతామణిని మణికంఠుని కంఠంలో అలంకరించాడు శ్రీమన్నారాయణుడు.
మరో ముఖ్య విషయం ఏమిటంటే ? మహిషిని సంహరించడం కోసం మణికంఠుడు దేవలోకానికి వెళ్ళాలి. కాని మానవ దేహంతో ఉన్న మణికంఠుడు దేవలోకానికి వెళ్ళలేడు. మణికంఠుడు దేవలోకానికి వెళ్ళేందుకు చింతామణి ఉపయోగపడుతుంది. ఆధ్యానించిన వారి యొక్క కోరికలను నెరవేర్చే శక్తి చింతామణికి ఉన్నది. కనుకనే మణికంఠుడు చింతామణిని ధ్యానించి చింతామణి యొక్క శక్తులతో దేవలోకానికి చేరుకున్నాడు.
ఆ తరువాత మహిషిని మర్దించి సంహరించాడు. ఆ విధంగా మణికంఠునకు చింతామణి ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతోనే చింతామణిని, మణికంఠునికి కంఠాభరణంగా అలంకరించాడు. నారాయణుడు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat