కాళైకట్టి" నిలయము

P Madhav Kumar
 అళుదా నదీ తీరంలో ఉన్న “కాళైకట్టి" నిలయాన్ని గూర్చి
.... దేవలోకానికి చేరుకున్న మణికంఠుడు మహిషితో యుద్ధం చేస్తాడు. మహిషిని మర్థించి క్రిందకు త్రోసేస్తాడు. అప్పుడు మహిషి భూలోకంలోని కల్లిడుంకుండ్రు అనే ప్రదేశంలో పడుతుంది.
మణికంఠుడు భూలోకంలోని కల్లిడుంకుండ్రు వద్ద పడిన మహిషిని మర్దించి, ఒక్క రక్తపు బొట్టు కూడా చిందకుండా మహిషిమర్ధనం గావించి సంహరిస్తాడు. వీరమణికంఠునిగా దేవతల చేత కీర్తించబడతాడు.
“కాళి కట్టి" ని గూర్చి మణికంఠుడు మహిషిని మర్దించి సంహరించే ఘట్టాన్ని తిలకించడం కోసం పార్వతీపరమేశ్వరులు "వృషభ వాహనం" పై బయలుదేరి, భూలోకంలోని అళుదానదీ తీరానికి చేరుకొని, మహిషికి మణికంఠునికి మధ్య జరిగే యుద్ధాన్ని తిలకిస్తుండగా, శివుని వాహనమైన వృషభం కూడా ఆ యుద్ధాన్ని చూస్తూ, రాక్షస మహిషి మణికంఠుడిని గాయపరుస్తుందేమోననే సందేహంతో కోపంతో రంకెలు వేయసాగింది. అప్పుడు పరమేశ్వరుడు వృషభాన్ని వారించి, అక్కడే ఆ వృషభాన్ని కట్టేస్తాడు. వృషబాన్ని కట్టిన ఆ ప్రదేశమే కాళి కట్టి.
“కాళే కట్టి” అళుదానది వద్ద ఉన్నది. కా? అంటే ? ఆంబోతు అని అర్ధం. కట్టి అంటే ? కట్టిన అని అర్ధం. కాళై కట్టి అంటే ? ఆంబోతును కట్టిన అని అర్ధం.
కాళైకట్టి నిలయం అంటే ? ఆంబోతును (వృషభమును) కట్టియుంచిన ప్రదేశము అని అర్ధం.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat