ఉయ్యాల జంపాలలో బాల మణికంఠుడూగేను .
కోయిల గీతములే జోల సంధ్య రాగములో
కైలాస వైకుంఠం …..తాకుతూ ..
ఊగేను ఉయ్యాల…
పాండ్య దేవేరి … పాండ్య దేవేరి కంటి పాప
వయ్యేవయ్య.
నవ్వితే ..నవరత్నాలు దొరలేను మా ముంగిట
ఉయ్యాల(2)….
ఉయ్యాల జంపాలలో బాల మణికంఠుడూగేను .
కోయిల గీతములే జోల సంధ్య రాగములో
కన్నయ్య బంగారు కొండ.
నను కన్నా పొన్నయప్ప లాలి.(2)
ఆకాశ తారలన్నీ ఒళ్ళంతాను కళ్ళు చేసి పులకించి చూసె నిన్ను భగవానుడని తెలిసి..
ఆ జాబిల్లి వెన్నెల జల్లి నిన్నేమో నిద్ర పుచ్చి తన్మయత్వం పొందె భగవానుడని తెలిసి..
ఆ పుంగవన తెమ్మెర మెల్ల మెల్ల వీచిందిలే.
ఆ పవనాలే చేతులుగ ఉయ్యాల ఊపెనులే
పాండ్య దేవేరి … పాండ్య దేవేరి కంటి పాప
వయ్యేవయ్య.
నవ్వితే నవరత్నాలు దొరలేను మా ముంగిట
ఉయ్యాల(2)….
ఉయ్యాల జంపాలలో బాల మణికంఠుడూగేను .
కోయిల గీతములే జోల సంధ్య రాగములో
కన్నయ్య బంగారు కొండ.
నను కన్నా పొన్నయప్ప లాలి.(2)
కర్పూర రవళి ,పావన పంపాలలో తేలి ఆడి వస్తానిల జోల పాడగా…
కైలాసాన్నే తాకంగానే కన్నతండ్రి మురిసిపోయే ..
వైకుంఠాన్నే తాకంగానే కన్న తల్లి పులకించేలే
కన్ను మూసి కన్ను తెరచి మమ్ము ఆట పట్టి స్తున్నావా..
అభిషేక పూజల్లోనా అలసి సొలసి న్నావయ్య.
పాండ్య దేవేరి కంటి పాప
వయ్యేవయ్య.
నవ్వితే నవరత్నాలు దొరలేను మా ముంగిట
ఉయ్యాల….
ఉయ్యాల జంపాలలో బాల మణికంఠుడూగేను.
కోయిల గీతములే జోల సంధ్య రాగములో
కైలాస వైకుంఠం …..తాకుతూ ..
ఊగేను ఉయ్యాల…
పాండ్య దేవేరి … పాండ్య దేవేరి కంటి పాప
వయ్యేవయ్య.
నవ్వితే నవరత్నాలు దొరలేను మా ముంగిట
ఉయ్యాల(2)…
ఉయ్యాల జంపాలలో బాల మణికంఠుడూగేను .
కోయిల గీతములే జోల సంధ్య రాగములో
కన్నయ్య బంగారు కొండ.
నను కన్నా పొన్నయప్ప లాలి.(2)