తిరునల్లార్ శనీశ్వర ఆలయం కారైకాల్ అనే పట్టణంలో
తమిళనాడులో వుంది.
నాసా వారిచే పంపించబడ్డ శాటిలైట్ అనేది భూపరిభ్రమణ సమయంలో తిరునల్లార్ యొక్క శనైశ్చర్య ఆలయ పరిధిలోనికి రాగానే శాటిలైట్ అనేది రెండు నుండి మూడు నిమిషాలు స్లో గా మూవ్ అవుతుందట.
దీనికోసం ఈ ఆలయంపై రిసెర్చ్ చేయటానికి నాసా వారు కొంతమంది పరిశోధకులను పంపించటం జరిగింది.కానీ వారికి ఖచ్చితమైన సైంటిఫిక్ ఆధారాలనేవి లభించలేదు.
నాసావారు కూడా దీనిని ఒక అద్భుతంగా భావించారు. అంతేకాకుండా ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్వకాలంలో సైంటిఫిక్ గా నిర్మించిన విధానం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
పూర్వీకులు ఎక్కడైతే యు.వి. కిరణాలు అనేవి ఎక్కువగా పడతాయో ఆ ప్రాంతాన్ని గుర్తించి అక్కడ ఆలయం నిర్మించారు.
30 నెలలకు ఒకసారి జరిగే శని త్రయోదశినాడు గ్రహాలూ ఒక కక్ష్య నుండి మరో కక్ష్యలోకి వెళ్లినప్పుడు అల్ట్రావైలెట్ కిరణాలు ఈ ఆలయం పై తీవ్రంగా పడతాయి కనక ఆ సమయంలో నాసావారిచే పంపించబడ్డ శాటిలైట్ స్లో అవుతుంది.
అయితే ఇది నాసావారు ప్రజలలో మూఢనమ్మకాలు తొలిగించటానికి చెప్పిందే తప్ప. నిజమైన ఖచ్చితమైన ఆధారాలనేవీ సైంటిఫిక్ గా వారు తెలియజేయలేదు.
హిందువులు అందులోనూ కొద్దిగా జాతకాలు వంటి వాటిపై కొద్దిగా నమ్మకం వున్నవారు శనేశ్వరుడు అంటే ఎనలేని భయం, భక్తి కూడా. ఎందుకంటే శనేశ్వరుడు మనకు జీవిత సత్యాన్ని తెలియజేస్తాడు.
కంటికి కమ్ముకున్న పొరలు ఐహికపరమైన సుఖాలు, భ్రమల నుండి మన కంటికి కమ్ముకున్న పొరలను తొలగిస్తాడు.
ఎందుకంటే ముఖ్యంగా శని దశలో లేదా మనకు కలిగిన అర్దాష్టమ శని లాంటి గ్రహ దోషాల వల్ల ఎంతో కష్టపడ్తే తప్ప పనులు అనేవి జరగవు.దీక్షతో,పట్టుదలతో, నిజాయితీగా వుంటేనే పనులు అనేవి ముందుకు సాగుతాయి.
శనిదోష నివారణకు మనం ఎన్నో పరిహారాలను పాటిస్తూ వుంటాం.
ఇక్కడ తిరునల్లార్ లోని పుష్కరిణిలో పుణ్య స్నానాన్ని ఆచరించి ఆ శనేశ్వరస్వామిని దర్శించి శని దోషం నుండి విముక్తిని పొందటం జరిగింది.
అందుకే దీనిని "నలతీర్థం" అంటారు.
ఇక్కడ మరో విశేషం దర్భలతో వెలిన శివలింగం కూడా ఈ ఆలయంలో వుంది.
ఇక్కడ బ్రహ్మ తీర్థంలో స్నానాన్ని ఆచరించి శివుడ్ని దర్శిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి.
ఈ ఆలయం దాదాపు 7వ శతాబ్దంలో నిర్మించి వుండవచ్చని భావిస్తున్నారు.
మొదట శనేశ్వరుని దర్శించి తరువాత భక్తులు శివాలయంలో ఆ దర్భేశ్వరుడిని దర్శించుకుంటారు.
ఈ ఆలయంలో బంగారు పూత పూయబడిన కాకి వాహనంగా వుంటుంది శనేశ్వరుడికి.
ఇక్కడ శనేశ్వరుడు అనుగ్రహమూర్తిగా వుండి ఆపద నుండి కాపాడే కుడి చేయి అభయాన్ని ఇస్తున్నట్లుగా వుంటుంది.
తమిళుల యొక్క సంవత్సరపు ఆరంభంలో నలతీర్థంలో గనక స్నానాన్ని ఆచరిస్తే పరమశివుడు లాంటి దేహధారుడ్యాన్ని, వర్ణాన్ని పొందుతారని అక్కడి వారి నమ్మకం.
సాధారణంగా శని పేరు వింటేనే లేదా స్మరిస్తేనే నలదమయంతి అనే పేరు తలచుకుంటే మనకు కష్టాలు తొలగిపోతాయని నమ్మకం.
దీనికొక పురాణ గాధ వుంది.
నల చక్రవర్తి కి కలి ఆవహించి రాజ్యాన్ని కోల్పోయి అడవికి వెళ్ళిపోవటం జరుగుతుంది. ఆ తర్వాత రాజు వంటవాడిగా, రధాన్ని నడిపేవాడుగా వుంటాడు.ఈ విధంగా నలదమయంతులు ఎన్నో కష్టాలు పడతారు.
శనిగ్రహ ప్రభావంతో. భారద్వాజుడి యొక్క సూచన మేరకు ఈ ఆలయం సమీపంలో వున్న పుష్కరిణిలో స్నానం ఆచరించి ఆ శనేశ్వరస్వామిని దర్శించుకుని వారు శనిగ్రహ దోషం నుండి బయటపడి తిరిగి వారి రాజ్యాన్ని పొందటమన్నది జరుగుతుంది.
అందుకే ఈ తీర్థానికి నలతీర్థమనే పేరు రావటం కూడా జరిగింది.
నీలాంజన సమాభాసం | రవిపుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం | తం నమామి శనైశ్చరం ||