నాగ దోషం ,కాల సర్ప దోషం నివారణోపాయాలు

P Madhav Kumar


కాల సర్పం దోషం పట్టినవారు.సప్తమ,అష్ట్టమాల్లో రాహు కేతువులు ఉన్నవారు.పూర్వ జన్మలో పాములను చంపినా వారు లేదా మంత్ర తంత్ర విధి విధానాలతో బంధించినవారు,పాముల పుట్టలను త్రవ్వి ఇండ్లు కట్టిన వారు నాగదోషం కలవారై పుడుతారు.అటువంటి వారు వివాహం,సంతానం,కుటుంబ అభివృద్ధి విషయాల్లో అడ్డంకులు,అవమానాలు పొంది,విరక్తి కలిగి జీవితం అంతం చేసుకొందామనే స్థితికి వస్తారు..


1. జ్ఞానదృష్టి లేకపోవటము మెదడు సరిగా ఎదగకపోవడమువల్లఅవమానాలు అపార్ధాలు చేసుకోవడము.


2. జన్మించిన సంతానమునకు బుద్ధిమాంద్యముకలుగుట


3. గర్భములో శిశువుమరణించుట .


4. భార్యభర్తల మధ్య సక్యతలేకపోవుట వైవాహికజీవతంలో అసంతృప్తి.


5. మరణించిన శిశువుకలుగుట.


6. గర్భము నిలవకపోవడము, విచిత్రమయిన రోగములు కలగడము.


7. అంగవైకల్యము సంతానము కలగడము, వాహన ప్రమాదాలు.


8. శస్త్రచికిత్సలు విఫలము అయిమరణించడం జరుగుతుంది.


9. వృషణముల వ్యాధులు , వ్యసనాలకు బానిసలుకావడము.


10. వీర్యకణములు నశించుట, నపుంసకత్వము ఏర్పడుట.


11. కాన్సర్, సిఫిలిస్ , హెర్నియా , ఎయిడ్స్ , మూత్రసంబందమయినరోగములు కలగడము.


12. వంశవృది లేకపోవడము, కుటుంబములో ప్రేమఅభిమానములు తగిపోవడము.


13. శత్రువుల వలన మృతి చెందడము, సంతానము శత్రువులుగామారడము.


14.మానసికశాంతిలేకపోవడము, విషజంతువులవల్ల, జలప్రమాదములవల్లమరణించడం.


15.అవమానాలులేకఅపనిందలవల్లమరణించడం, పరస్త్రీ సంపర్కము.


16. రుణగ్రస్థులు అగుట హామీలు ఉండుట జరుగును.


జాతకుని జన్మకుండలిలో రాహుకేతువుల మధ్య మిగిలిన అన్నిగ్రహాలు వచ్చినచోదానిని కాలసర్పయోగం అంటారు. దీనిలో చాలా రకాలు వున్నాయి. వాటి వాటి స్థితులను ఆధారంగా వాటికిపేర్లు నిర్ణయంచెయ్యటం జరుగుతుంది.

 దానిప్రకారమేకాలసర్పయోగం వలన కలిగే ఫలితంకూడా నిర్ణయం చెయ్యబడుతుంది.

వివిధరకాలకాలసర్పయోగములు


1.)అనంత కాల సర్ప యోగము


2.)గుళికకాలసర్పదోషం


3.)వాసుకికాలసర్పదోషం


4.)శంక పాల కాలసర్పదోషం


5.)పద్మకాలసర్పదోషం


6.)మహాపద్మకాలసర్పదోషం


7.)తక్షకకాలసర్పదోషం


8.)కర్కోటకకాలసర్పదోషం


9.)శంఖచూడకాలసర్పదోషం


10.)ఘటకకాలసర్పదోషం


11.)విషక్త, లేక విష దానకాలసర్పదోషం


12.)శేషనాగకాలసర్పదోషం


1.నాగదోషం త్రీవ్రమైనది అయితే శుక్ల పౌడ్యమినాడు శ్రీకాళహస్తిలో నిద్రచేసి మరుసటి దినం శివ దర్శనం చేసి పూజలు జరిపించుట వల్ల నివారణ కల్గుతుంది.


2.ఆరు ముఖాల రుద్రాక్షలు ధరించుట వలన నివారణ పొందగలరు.


3.నాగ ప్రతిమకు 27 దినాలు పూజచేసి దేవాలయమునకు దానం చేయవలేయును.


4. రాహు కాలంనందు ప్రతి సోమవారం నాగ దేవతకు క్షీర నివేదన చేసి పూజ చేయాలి. లేదా రాహు కాలంనందు నాగ దేవతకు క్షీర నివేదన చేసి నవగ్రహ ఆలయంలో దానంగా ఇచ్చుట వల్ల నివారణ కల్గును.


5.త్రీవ్ర్రమైన నాగదోషంఉన్న యడల నాగ పంచమి రోజున శ్రీకాళహస్తి క్షేత్రాన్ని దర్శించి దుర్గ, పాతాళ వినాయకుని దర్శించి పూజించటం వల్ల నివారణ కలుగుతుంది.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat