దేవుడొచ్చినాడురో సూడరో సూడరా (2)
అయ్యప్ప స్వామిరో వచ్చెరో వచ్చెరా (2)
ఓ దేవా మా దేవా మా కోసమే వచ్చినావ..
స్వామి.. ఓ దేవా.. స్వామి.. మా దేవా.. స్వామి..
మా కోసమే వచ్చినావ
ముక్కోటి దేవుళ్ళను ముందుగానే కొలిచినాము (2)
నువ్వు ఒక్కడివే దేవుడని ఇప్పుడు తెలుసుకున్నాము (2)
నువ్వు ఒక్కడివే దేవుడని ఇప్పుడు తెలుసుకున్నాము (2)
మనసంతా ఇప్పేసి ఎదలన్ని చెప్పేద్దాం.. స్వామి ..
మనసంతా ఇప్పేసి ఎదలన్ని చెప్పేద్దాం
హరిహరా తనయుడా అందరి దేవుడా ఆపదలో
ఆదుకొనే శబరిమలై నాధుడా......
మనసంతా ఇప్పేసి ఎదలన్ని చెప్పేద్దాం
హరిహరా తనయుడా అందరి దేవుడా ఆపదలో
ఆదుకొనే శబరిమలై నాధుడా......
||దేవుడొచ్చి||
రంగు రంగు పూలు తెచ్చి హారలే వేసినాము (2)పుట్టతేనె పాలతోటి ఫలహారము చేసినాము (2)
పాదాలే కడిగేము నీ పూజలే చేసేము (2)
గణపతి సోదరుడా జ్యోతీస్వరూపుడ
కార్తికేయ సోదురుడా
కాంతిమలై వాసుడా......
||దేవుడొచ్చి||
పగలంతా పనిచేసి అలసిసొలసి పోయినాము (2)సందెవేళ కాగానే ఆలయంబు చేరినాము (2)
ఆడేము పాడేము ఆనందమే పొందేము
ఆడేము.. స్వామి.. పాడేము.. స్వామి.. ఆనందమే పొందేము
ఎరిమేలి వాసుడా వావరకు మిత్రుడా కరిమలై వాసుడా
పంబానది బాలుడా.. .....
||దేవుడొచ్చి||
దేవుడొచ్చినాడురో సూడరో సూడరాఅయ్యప్ప స్వామిరో వచ్చెరో వచ్చెరా
ఓ దేవా మా దేవా మా కోసమే వచ్చినావ ఓ దేవా..
స్వామి.. మా దేవా.. స్వామి.. మా కోసమే వచ్చినావ
మా కోసమే వచ్చినావా........ మా కోసమే వచ్చినావా.......... మా కోసమే వచ్చినావా... ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప..
ఈ పాటను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి వినండి.
