కేరళ రాష్ట్రం కొట్టాయం కు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న 'వైకోం 'పట్టణంలో అన్నదాన ప్రభు" గా పేరొంది కొలువైఉన్న 'వైకోం మహాదేవ" దర్శనం
మానవసేవే మాధవసేవ అన్న ఆర్యోక్తిని ఆచరణలో చూపుతున్న ఆలయం ఇది ..
నిత్యం రెండు వేల మందికి వందల సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అన్నదాన ప్రభువు.
ఇక్కడ అన్నదానం కోసం వంట వండేటప్పుడు,వడ్డించేటప్పుడు శివయ్య స్వయంగా పాలుపంచుకుంటారని భక్తుల నమ్మకం.
అందరికీ ఆకలి తీర్చి ఆరోగ్యం పంచాలనే అన్నదాన ప్రక్రియ ప్రారంభమైంది అని కథనం.
ఈరోజు అందరి కడుపు నిండింది అని నిర్ధారణ చేసుకున్నాకే ఆలయ తలుపులు మూసుకుంటాయి.
.
దక్షిణ కాశిగా పేరొందిన ఆలయం.
నిత్యం శివనామస్మరణతో మారుమోగే శైవక్షేత్రం.
కులమత భేదాలు లేని సన్నిధి.
త్రేతాయుగంలో ఖరాసురుడు అనే రాక్షసుడు పరమశివుని గురించి ఘోరతపస్సు చేయగా శివయ్య ప్రత్యక్షమై 'ఏ వరం కావాలో కోరుకో' అన్నప్పుడు మోక్షం ప్రసాదించండి స్వామి అని అడిగినటువంటి ఖరాసురుని కోరిక విని సంతోషించి
మూడు మోక్షలింగాలను ఖరుడికి ఇవ్వడం జరిగింది.
*ఖరాసురుడు తన కుడి చేతిలో ఒక శివలింగం ,ఎడమ చేతిలో ఒక శివలింగం, మెడ మీద ఒక శివలింగం పెట్టుకుని దక్షిణ దిశగా ప్రయాణమై మార్గమధ్యంలో అలసిపోయి ఒకచోట మూడు శివ లింగాలనూ కింద పెట్టి విశ్రమించి లేచిన తర్వాత లింగాలను పైకితియ్యాలని ప్రయత్నించినప్పుడు శివలింగాలు రాకపోగా అశరీరవాణి నుండి ఒక మాట వినిపించింది "నేను ఇక్కడే ఆశ్రయం పొందుతాను" అని...
అనంతరం చేసేదిలేక
ఖరాసురుడు ఈ మూడు శివ లింగాల బాధ్యతను వ్యాఘ్రపాద మహర్షి అనే ఒక మహర్షికి అప్పగించి అక్కడే మోక్షాన్ని పొందాడు అన్నది స్థలపురాణం..
తదనంతరం పరశురాముడు ఖరాసురుడి
-కుడిచేతిలో నుండి తేబడిన శివలింగాన్ని వైకోమ్ లో -ఎడమచేతిలో పట్టుకుని వచ్చిన లింగాన్ని ఎట్టుమన్నూరు లో
-మెడపై పెట్టుకుని వచ్చిన లింగాన్ని కాడతత్తూర్ లలో ప్రతిష్టించి ఆలయాలు నిర్మించినట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది.
-వైకొం లో ఉదయం స్వామి దక్షిణామూర్తిగా
-మధ్యాహ్నం కిరాతమూర్తిగా -సాయంత్రం సచ్చిదానందమూర్తి గా భక్తులకు దర్శనమిస్తారు.
నైవేద్యంగా అన్నమే సమర్పిస్తారు
ఇక్కడ భోజనం చేస్తే జీర్ణవ్యవస్థ నయమై సకల వ్యాధుల నుంచి బయట పడగలమని భక్తుల ప్రగాఢ విశ్వాసం ..
వందల సంవత్సరాలుగా అన్నదానం ఇక్కడ
జరుగుతోంది
రోజుకి మూడు వేల కిలోల బియ్యం భక్తులకు అన్నప్రసాదంగా అందించడం జరుగుతుంది నిరంతరాయంగా ఈనాటికీ ...
భార్గవపురాణం సరళసంహితలో
ఖరాసురుని యొక్క చరిత్ర ఈ ఆలయ విశిష్టత వివరింపబడింది..