చూడాలనున్న దయా చూచి తరియించు భాగ్యమయా
నిన్ను చూడాలనుకుంటే వేవేల జన్మాల పుణ్యం వెంటుండాలయ్య
//చూడాలనున్న దయా//
స్వామియే శరణమయ్యప్పా స్వామియే శరణమయ్యప్పా ॥2॥
ఆ శబరి గిరిపై ... ఓహో... ఓహో ! ... ఓహో ! ఓహో
ఆ ! శబరి గిరిపైన నీ ! గర్భ గుడిలోన నిను చేరె ఆ ! నీటి బిందువుకున్నంత నీ పూజ చేసేటి పత్రంకున్నంత నీ ! పాదముల చెంత పువ్వుల కున్నంత ॥2॥
ఆ ! పాటి భాగ్యము మాకేది స్వామి మరుజన్మ మాకుంటే కలిగించు స్వామి మణికంఠ స్వామి
స్వామియే శరణమయ్యప్పా స్వామియే శరణమయ్యప్పా ॥2
//చూడాలనున్న దయా//
తనువున్న వరకు... ఓహో .... ఓహో !.... ఓహో !.... ఓహో తనువున్న వరకు నీ ! కొండకొస్తా నిండైన రూపాన్ని నే ! చూసి వస్తా ఒకవేళ నీ ! కొండ రాలేకపోతే గుడ్డుడినై నా ! కంట నిన్ను చూడకుంటే అంతటితో ఈ ! జన్మ చాలించు స్వామి నీ ! పాదముల చెంత చోటివ్వు స్వామి
మణికంఠ స్వామి //2//
//చూడాలనున్న దయా//
స్వామియే శరణమయ్యప్పా స్వామియే శరణమయ్యప్పా ॥2॥
కనులుండి కూడా ... ఓహో... ఓహో !... ఓహో ! ... ఓహో కనులుండి కూడా కబోదైనాను మంచేదో చెడుయేదో తెలియక ఉన్నాను. // 2 //
పాపాల పుట్టోలె పెరుగుతు ఉన్నాను ఇహలోక బంధాలలో బందీనైనాను మోక్షాన్ని నే కోరి వచ్చాను స్వామి - మనసున్న మా ! మంచి మణికంఠ స్వామి మన్నించు స్వామి
స్వామియే శరణమయ్యప్పా స్వామియే శరణమయ్యప్పా ॥2॥
//చూడాలనున్న దయా//