స్వామి కొండకు నేను వస్త గురుస్వామి తోల్కపోవ ||2||
దారిలో నీకు సేవలు చేస్త గురుస్వామి తోల్కపోవ ||2||
స్వామయో ! గురుస్వామయో ! గురుస్వామయో నీ ! కాల్మోక తోల్కపోవ ||2||
||స్వామి కొండకు॥
కార్తీక మాసం వచ్చిందంటే కాళ్ళు చేతులు ఆడవయ్యా ||2||
బువ్వా తినబుద్ది కాదు
కంటికి నిద్దుర రానే రాదు ||2||
అన్నాదమ్ముల ఆటలు లేవు అమ్మా అయ్యతో మాటలు లేవు ||2||
||కార్తీక మాసం||
మాలవేసి నీతో వస్త గురుస్వామి తోల్కపోవ ||2||
దారిల నీకు సేవలు చేస్త గురుస్వామి తోల్కపోవ ||2||
స్వామయో ! గురుస్వామయో ! గురుస్వామయో నీ ! కాల్మోక తోల్కపోవ ||2||
మాలవేసె స్వాముల చూస్తే మనసు నాకు పులకరించే ||2||
స్వామి భజన పాటలు వింటే కంట నీరు కారవట్టే ||2||
పడిపాట వింటూ ఉంటే గుండె జల్లు జల్లు మనె ||2||
||మాలవేసె||
ఇరుముడెత్తి నీతో వస్త గురుస్వామి తోల్కపోవ ||2||
స్వామి నీవి కాళ్ళుమోక్త గురుస్వామి తోల్కపోవ ||2||
స్వామయో ! గురుస్వామయో ! గురుస్వామయో నీ ! కాల్మోక తోల్కపోవ ||2||
||ఇరుముడెత్తి||
చేయిపట్టి నీవు నడిపిస్త ఉంటే నా ! కన్న తండ్రి గుర్తోచ్చినాడు ||2||
అడవిలో నాకంటు ఆకలివేస్తే కన్న తల్లివై తిన్పించినావు ||2||
ఏ ! చిన్నరాయి నాకు గుచ్చుకున్న నీ ! కంట కన్నీరు నే ! చూస్తినయ్యా ||2||
||చేయి పట్టి నీవు||
రుణము నీది ఎట్లా తీర్చ చెప్పవయా గురుస్వామి ||2||
అడిగిచూడు ఒక్కసారి ప్రాణాలైన ఇస్తానయ్యా
||2||
స్వామయో ! గురుస్వామియో నీ ! రుణమునెట్ల తీర్చనయా ||2||