సనాతనధర్మానికి శత్రువు హిందువే.
దైవం మాట ఎత్తితే చాలు టైం లేదు అంటాడు.
అన్యమతస్థులకు ఎక్కడి నుండి వస్తుంది టైం?
నీకంటే కూడా గొడ్డు చాకిరి చేస్తారు. కానీ పిల్లలకి చిన్ననాటి నుండే మతబోధ చేస్తారు. మనం చేయం.
పోనీ చేసేవారిని సపోర్ట్ చేస్తారా అంటే అదీ ఉండదు. నీకెందుకు అంటారు. పిల్లలు ఈ విషయం మీద ఏదన్నా మాట్లాడితే ఈ వయస్సులో దేనికి నీకు అంటారు. టైం ఉండదు. చిన్నప్పుడు నేర్పక, వయస్సు లో చేయక ఎప్పుడు చేస్తారు?
అందుకే హిందువులలో ఉన్నవారు కన్వర్ట్ అవుతారు కానీ అన్యమతస్థులలో కన్వర్షన్ చాలా తక్కువ. మనవాళ్ళు 1000 మంది వెళితే అవతలివారిలో మహా అయితే ఓ 10మంది ఉంటారు..
ధర్మాన్ని ఎవరో వచ్చి నిలబెడతారు. ఎవరో వచ్చి కాపాడతారు అని యువతని సనాతనాధర్మానికి దూరం చేసేశారు. దేవుడంటే కోరికలు తీర్చేవాడుగా చేశారు. దేవాలయాలు ఈ బలహీనతలని పూజలు, అష్టోత్తరాలు, అభిషేకాలు, దర్శనాలు అంటూ సొమ్ము చేసుకుంటున్నాయి. పిల్లలకి గాని, యువతకి కానీ ధర్మం చెప్పేవారు లేరు. బోధించేవారు అసలే లేరు. ఒకరిద్దరు ఏదన్నా బోధిద్దామని ప్రయత్నిస్తే భాషాజ్ఞానం లేకపోవడం వల్ల తప్పులు పట్టి వారిని అవమానిస్తున్నారు.
మనం మాత్రం సంపాదించాలి. మేడలు కట్టాలి. ధర్మం మాత్రం బోధించకూడదు. అదేమంటే వీటికే సమయం లేదు.
అడుక్కుతినే అన్యమతస్థులు కూడా వాళ్ళ ధర్మాన్ని పిల్లలకి నేర్పుతున్నారు. మనకి ఎందుకు సమయం ఉండదో మరి..