సుబ్రహ్మణ్యస్వామిని 'మురుగ' అంటారు కదా. తమిళులు పెట్టుకున్న ఈ పేరుకి అర్థమేమై ఉంటుంది?

P Madhav Kumar

 

మురుగన్' అనే పేరు తమిళ భాషలో 'అందగాడు' అనే అర్ధం.


 అయితే, సుబ్రహ్మణ్యుని నామాలు సంస్కృతంలో అనేకం ఉన్నాయి. 


అందులో 'మురుక' అనేది ఒకటి. 


దీనికి అర్థం 'స్కాంద పురాణం' ఇలా చెప్తోంది.


'ము' కారాస్తు ముకుందః స్యాత్

'రు' కారో రుద్రవాచకం౹

'క' కారో బ్రహ్మవాదీచ ' 

'మురుకో' గుహ వాచకః౹౹


    'ము' అనేది విష్ణువునీ, 'రు'- రుద్రునీ, 'క'- బ్రహ్మనీ తెలియజేస్తుంది. 


బ్రహ్మ విష్ణు శివాత్మకమైన పరబ్రహ్మగా సుబ్రహ్మణ్యుని (గుహుని) ఉపాసిస్తూ 'మురుక' అని స్వామిని పిలుస్తారు. అని ఒక నిర్వచనం. 


తమిళ భాషలో 'క' కారానికీ, 'గ' కారానికీ తేడా లేదు కనుక 'మురుగ' అని వారంటారు అంతే.


ఓం శరవణ భవ 🙏🏻




#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat