వింత దేవాలయం!
[మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్రసాదం పెడితే ప్రత్యక్షంగానే ఆయన భుజిస్తారు. సమర్పించిన నైవేద్యం అందరూ చూస్తుండగానే మాయమవుతుంది.
📿 గ్రహణం సమయంలో కూడా తెరిచి ఉండే ఏకైక కేరళ దేవాలయం తిరువరపు శ్రీకృష్ణ దేవాలయం, కొట్టాయం.
📿 అర్ధరాత్రి ఏకాంతసేవ తర్వాత కూడా దీపారాధన చేసే ప్రపంచంలోని అరుదైన హిందూ దేవాలయంగా పిలుస్తారు.
📿 ఇక్కడి కృష్ణపరమాత్మ మూర్తి చాలా ఆకలితో ఉంటారు. ఇక్కడ అర్చకులు రోజుకు 7 సార్లు స్వామికి మహా నైవేద్యాన్ని సమర్పిస్తారు. సమర్పించిన నైవేద్యం ప్రతిసారి కొంచెం తగ్గుతూ ఉండటం తరుచుగా గమనిస్తుంటారు. స్వామివారు స్వయంగా తింటారు అని ఇక్కడి భక్తుల విశ్వాసం. అదే విధంగా అందరూ చూస్తుండగానే ప్రసాదం మాయమవుతుంది.
📿 గుడి తెల్లవారుజావున 2 గంటలకు తెరుస్తారు. సాధారణంగా అన్ని దేవాలయాలలో అభిషేకం, అలంకరణ అనంతరం స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు కానీ ఈ దేవాలయంలో నైవేద్యం నివేదన చేసిన తర్వాత అభిషేకం, అలంకరణ చేస్తారు.
📿 నైవేద్యం సమర్పించడంలో కొంత ఆలస్యమైనా, ఆలయ ప్రధాన ద్వారం తెల్లవారుజామున తెరవకపోయినా చాలా దోషంగా భావిస్తారు. అందుకే ప్రధాన అర్చకుడి చేతిలో గొడ్డలి పట్టుకుంటారు. ఏదేని కారణం చేత తాలం పనిచేయకపోయినా, తాలం పోయినా, గొడ్డలితో తాలాన్ని పగలకొట్టడం ఇక్కడి ఆనవాయితీ.
📿 కృష్ణుడికి చేసే నైవేద్యం చాలా రుచికరంగా ఉంటుంది. స్వామికి నివేదించిన అనంతరం భక్తులందరికీ ప్రసాదం పంచుతారు. ప్రసాదం తీసుకోకుండా ఏ భక్తుడూ ఆకలితో వెళ్ళకూడదని ఇక్కడి నియమం. అందుకే అర్చక స్వాములు “ఇంకా ఎవరైనా ప్రసాదం తీసుకోనివారు ఉన్నారా అని పెద్ధగా అరుస్తారు”.
📿 కృష్ణుడికి సమర్పించే నైవేద్యం ఆలస్యమైతే ఆకలికి తట్టుకోలేక కడుపు ఖాళీ అవ్వడం చేత స్వామివారి నడుము చుట్టూ కట్టిన ఆభరణం వదులై కొన్ని ఇంచులు క్రిందకు దిగడం మనం చూడవచ్చు. పూర్వం గ్రహణం సమయంలో ఆలయం మూయడం వలన ఇలాంటి అపసృతి చోటు చేసుకోవడం వలన, ఈ దేవాలయాన్ని గ్రహణం సమయంలోనే కాదు మరెప్పుడూ మూయరు .
📿 గ్రహ దోషాలు, గ్రహణ దోషాలు, సంతాన దోషాలు, సర్పదోషాలు, వ్యాపారాలలో నష్ట దోషాలు, వివాహ దోషాలు, బ్రహ్మహత్య వంటి మహాపాతకాలు ఏమున్నా సరే ఇక్కడికి వచ్చి కృష్ణపరమాత్మను దర్శించి, పూజిస్తే దోషాలు నివారింపబడుతాయి. దేవతలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు కృష్ణభగవాణుడి సేవకులు కనుక ఇక్కడి కృష్ణభక్తులకు ఎటువంటి జాతక దోషాలు అంటవని స్వామిని భక్తితో కొలుస్తారు.
📿 సైంటిష్టులకు కూడా అంతుచిక్కని ఎన్నో అద్భుతాలు ఈ ఆలయంలో జరిగాయి. భగవంతుడు ఉన్నాడు అని చెప్పడానికి ఇంత కన్నా గొప్ప దేవాలయం ఎక్కడ ఉంటుంది!
*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*