ఏకాక్షి కొబ్బరికాయ ఇది వరకు శ్రీశైలం ఫారెస్ట్ లో దొరికేవి ఇప్పుడు పూజ స్టోర్స్ లో కూడా అమ్ముతున్నారు, గృహంలో నిత్యం పూజ నైవేద్యం పెట్టి పూజ చేసే వారు ఒక్కోసారి కొన్ని కారణాల వల్ల పూజ చేయలేరు, ఊరికి వెళ్తుంటారు అలాంటి సమయంలో దేవిడికి నైవేద్యం పెట్టలేరు, ఏకాక్షి కొబ్బరికాయ పెద్ద కుంకుడు కాయ పరిమాణంలో ఉంటుంది అది ఒక్కటి పూజ మందిరంలో దేవుని ముందు ఉంచడం వల్ల నిత్యా నైవేద్యం పెట్టడంతో సమానం అని పెద్దల సలహా... ఆ ఫలం పాడవుదు కాబట్టి నిత్యం నైవేద్యం పెట్టినట్టు..పెద్ద కొబ్బరికాయ లో కూడా ఏకాక్షి ఒంటికన్ను కొబ్బరికాయ దొరుకుతుంది ఇది చాలా అరుదుగా ఉంటుంది ఆ నీటితో లక్ష్మీ దేవికి కానీ శివయ్య కు కానీ అబీషేకం చేయడం వల్ల సిరిసంపదలు కలుగుతుంది అంటారు...