🌺శబరి యాత్ర-ముఖ్యమైన రోజులు🌺

P Madhav Kumar



సాధారణంగా శబరి యాత్రికులు 3 ముఖ్య రోజులలో శ్రీ అయ్యప్ప స్వామిని దర్శింకునేందుకు ఇష్టపడతారు. 


విషుపూజ:

ఇది శ్రీ స్వామి వారి పుట్టిన రోజు. ఇది మళయాళ సంవత్సరాది రోజున, సాధారణంగా ఏప్రిల్‌ నెలలో వస్తుంది. విషు పూజకు స్థానికులైన మళయాళీలే ఎక్కువగా వెళ్తారు. 

 

మండల పూజ: 

ఇది శబరిమలై యాత్రలో ముఖ్యమైనది. ఈ యాత్ర చేసేవారు కార్తీక మాసం, మొదటి రోజున మాలధారణ చేస్తారు. 41 రోజులు మండల దీక్షను భక్తిశ్రద్ధలతో ఆచరించి మార్గశిర మాసం 15 రోజు నాటికి శబరిగిరిని చేరతారు. అప్పటికి శబరిమలైలో దేవస్థానం వారు పదునెట్టాంబడి పూజ చేసి భక్తులు 18 మెట్లను సిద్ధం చేసి ఉంచుతారు. మండల పూజకు సాధారణంగా నవంబర్‌ 16 లేక 17 తేదీల్లో దేవస్థానం తెరిచి 41 రోజుల పాటు పూజా కార్యక్రమాలు జరుపుతారు. 

 

మకర జ్యోతి:

మకర సంక్రాంతి పర్వదినాన లక్షలాది అయ్య ప్ప భక్తులు తమ ఇష్టదైవాన్ని, జ్యోతి స్వరూపు నిగా కనులారగాంచి, పులకించి, పరవశించే రోజు. ఆ రోజు సాయంకాలం పందళ రాజ వంశీయులు తెచ్చిన తిరువాభరణాలను స్వామి వారికి అలంకరించి దీపారాధన చేసిన వెంటనే భక్తులు సన్నిధానం ముందు ఉన్న కాంతి మలై (పొన్నంబల మేడు) వైపుకు చూస్తుంటారు. సాయంకాలం సుమారు 6.45 గంటలకు భక్తులకు 3 సార్లు జ్యోతి దర్శనం కలుగుతుంది






 

🌼శబరిమలైలో ముఖ్య సేవలు🌼


స్వామి సన్నిధానంలో నవంబర్‌ 16 లేక 17 తేదీలలో ప్రారంభమై 41 రోజులు డి సెంబర్‌ 26 లేక 27 తేదీల వరకు మండల ఉత్సవం జరుగుతుంది. దీనికి మొదలు పదు నెట్టాంబడికి పూజలు చేస్తారు. పడి పూజలు చాలా వైభవంగా జరుగుతాయి. మకర సంక్ర మణ ఉత్సవం జనవరి 1 నుంచి 20 వరకు జరుగుతుంది. ఆగస్టు – సెప్టెంబర్‌ మాసంలో వచ్చే ఓనమ్‌ ఉత్సవం కూడా కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఏప్రిల్‌లో విషు పూజ జరుపుతారు. 

 

స్వామి వారి తిరువాభరణాలు:

మకర జ్యోతి కనిపించే ముందు స్వామి వారి కి తిరువాభరణాలు అలంకరించడం సంప్రదాయంగా వస్తోంది. మూడు అలంకృతమైన పెట్టెలలో వజ్ర కిరీటం, బంగారు కడియాలు, స్వామి ఖడ్గంతో పాటు అనేక వజ్ర వైఢూర్యా లు ఉంటాయి. పందళ రాజవంశం వారి ఆధీ నంలోనే ఈ అమూల్యమైన అభరణాలు ఉంటాయి. మకర సంక్రాంతికి రెండు రోజుల ముందుగా పందళ రాజ వంశీయులు దేవ స్థానం బోర్డు అధికారులకు తిరువాభరణాలు అప్పగిస్తారు. ఈ అభరణాలు మొదట శబరిమలైకి 88 కిలోమీటర్ల దూరంలో ఉన్న పందళలోని వెలియ కోయికెల్‌ ధర్మశాస్తా ఆలయం లో ఉంచి పూజలు చేస్తారు. 

 

మకర విళక్కు ఉత్సవం:

మకర జ్యోతి కనిపించిన రాత్రి సన్నిధానంలో మకర విళక్కు ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవం ప్రారంభం నుంచి ఏడు రోజుల పాటు చేస్తారు. మణి మండపంలో పులి స్వారీ చేస్తున్న శ్రీ స్వామి అయ్యప్ప తైల వర్ణ చిత్రాన్ని ఉంచుతారు. ఇక్కడ నుంచి మాళిగ పురత్తమ్మ ను ఏనుగుపై కూర్చోబెట్టి పదునెట్టాంబడి వరకు ఊరేగింపుగా తీసుకువస్తారు. ఈ ఊరేగింపు పొడవునా దీపాల బారు, తాళ వాద్యాల హోరు చూసే వారికి చూడ ముచ్చటగా ఉం టుంది. పురాతన కాలం నుంచి సంప్రదాయ బద్దంగా వస్తున్న మకరవిళక్కు ఉత్సవాన్ని చూసిన తర్వాతే సన్నిధానాన్ని భక్తులు వదలాలనే నియమం ఉంది. 

 

☸☸☸☸☸☸☸☸☸☸☸☸

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat