*ఆచార్య సద్బోధన:* ➖➖➖✍️

P Madhav Kumar



*మానవుడు ఆనందమును బయట ప్రపంచములో వెదుకుతున్నాడు.* 


*నిజానికి బయటి విషయాలలో ఏమీ సౌఖ్యం లేదు, ఆనందము ఉండదు.*


*కుక్క ఎండిపోయిన ఎముకను గట్టిగా కొరికినప్పుడు, ఆఎముక విరిగి దవడకు గుచ్చుకొని రక్తము స్రవిస్తే, ఎక్కడినుంచి ఆ రక్తము అని విచారణ చేయక, అది ఎముకనుంచే వస్తున్నదని ఆనందిస్తుంది.* 


*అట్లనే ఆనందముకాని, దుఃఖముగాని విషయాలలో లేవు, మనలోనే ఉన్నవి.* 


*చంటిబిడ్డ బొటనవ్రేలు చప్పరిస్తుంది. దానిలో సారమేమున్నది!* 


*ఆనందము బయటినుంచి దొరకుతోందనే అభిప్రాయానికి అమాయకత్వమే కారణం.* 


*ఇలాంటి సత్యనిత్య విషయాలను తెలిపే నిమిత్తం శాస్త్రములను, సత్గ్రంథములు పఠనం చేయాలి.* 


*గురువుల బోధనలు ఆచరించాలి. అయితే విత్తనముంటే, మొక్క ఉంటే, తోటమాలి దానిని సరియైనరీతిగా పోషించి పెంచగలడు.* 


*ఉన్నదాన్ని తెలియపరచుటే శాస్త్రములు, గురువు చేసే ఉపకారము. నువ్వెవరు? నేనెవరు? ఎక్కడి నుంచి వచ్చాము? అని ప్రశ్నలు వేసి వాటికి అనుభవరూపమైన సమాధానములను సాధకునిచే చెప్పిస్తాయి. తద్వారా సత్యాసత్యములు వివేచన అలవడుతుంది. పరమాత్మ సన్నిధికి మార్గం దొరుకుతుంది.*✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat