కథల్లో చిన్నప్పటి నుండి వింటున్నది. కానీ ఉందా లేదా ఇదే సందేహం చాలా మందికి ఉంది. నిజమా కల్పితమా.. శేష నాగు ఇప్పటికీ ఉందంటే నమ్ముతారా.. భూమితో ముడిపడి ఉన్న లక్షలాది సంవత్సరాల మిస్టరీ వీడింది. మనం కథలో విన్న ఆ నాగలోకం భూమి పైనే ఉంది. శ్రీమహా విష్ణువు శేషతల్పం శేషనాగు, సముద్ర మదనానికి ఉపయోగించిన వాసుకీ సర్పం గురించి కథలు కథలుగా విన్నాం. నాగు పాములకు లోకం ఉంది. అదే నాగలోకం అన్న కథలు వింటూనే ఉన్నాం. కానీ అది అంతా కల్పితమని కొందరు కొట్టిపారేస్తారు. సర్పాలకు లోకమా అని ఆశ్చర్యపోయిన వారూ ఉన్నారు. ఇలాంటివి మీరు నమ్మలేకపోతే ఒక్క సారి ఇది చదవండి.
నాగలోకం ఇప్పటికీ గుప్తంగా ఉంది. లక్షల సంవత్సరాల పురాతన రాజ్యం ఇప్పటికీ ఉంది . లక్షల సంవత్సరాల నాటి కథలకు రుజువులు కనిపిస్తాయి. సృష్టితో ముడిపడి ఉన్న రాజ్యం భూమి పైనే ఉంది. అక్కడ ఇప్పటికీ శ్రీ మహావిష్ణువు శేషపాన్పు ఉంది. సముద్ర మదనానికి ఉపయోగించిన వాసుకీ సర్పం ఇప్పటికీ కనిపిస్తుంది. కానీ ఇదంతా మీరు నమ్మకపోవచ్చు. ఇది నిజం. లక్షల సంవత్సరాల నాగలోకం ఇప్పటికీ భూమి క్రింద గుహలో దాగి ఉంది. గుహలో ఉన్న ఒక్కో రహస్యం మనల్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తొంబై అడుగుల లోతున్న గుహ ఆనాటి రహస్యాలను బయటపెడుతుంది. లక్షల సంవత్సరాల క్రింతం సర్పయాగం జరిగిన అగ్నిగుండం కూడా సజీవంగా ఉంది. ఎన్నో దేవ రహస్యాలను తనలో దాచుకున్న ఆ గుహ పేరే పాతాళ భువనేశ్వర్. ఉత్తరాఖండ్ లోని పితూర్ ఘడ్ జిల్లాలో ఉంది. ఇక్కడే నాగలోక రహస్యం తెలిసిపోయింది.
పాతాళ భువనేశ్వర్ లోని గుహలు సాధారణమైన గుహలు కావు. లక్షల సంవత్సరాల నుండి దేవ రహస్యాలతో ముడిపడి ఉన్న గుహలివి. ముప్పైమూడు కోట్ల దేవతలకు సంబందించినది. శేషనాగు, వాసుకి ఇంకా ఎన్నో లక్షల సర్పాలకు నిలయం ఈ గుహ. మనం చిన్నప్పటి నుండి వింటున్న కధలకు సజీవ సాక్ష్యం. మరి పురాణాల్లో ఉన్న నాగలోకం భూమి పై ఉన్న నాగలోకం ఒకటేనా..అంటే .. ఒక్కటే అని చెప్పవచ్చు. పాతాళ భువనేశ్వర్ లో ఉన్న నాగలోకంలో శేషనాగు కోరలు కనిపిస్తుంటాయి. మహా సర్పం ఎముకలు ఈ గుహలో పరుచుకుని ఉన్నాయి. ఇదే నాగలోకం.. ఇప్పటి వరకు మీరు కథలో విన్నది. ఇందులో ఉన్న శేష నాగు తన తలపై భూమిని మోస్తున్నట్లుగా వింటూనే ఉన్నాం. పురాణాల కథనం కూడా అదే.
ఈ గుహలకు చేరుకోవాలంటే ఉత్తారాఖండ్ లోని ఫితోర్ ఘడ్ నుండి ఈ నాగలోకం వేట ప్రారంభించాల్సిందే.
పితోర్ ఘడ్ నుండి 80 కిలో మీటర్ల దూరంలో పాతాళ్ భువనేశ్వర్ ఉంది. ఇక్కడే ఆ గుహలు ఉన్నాయి. ఇందులోనే శేషనాగుతో ముడిపడి ఉన్న రహస్యం దాగుంది. ఈ గుహ విశాలమై ఓ పర్వతం కింద 90 అడుగుల లోపల ఉంది. దూరం నుండి చూస్తే ద్వారం మాత్రమే కనిపిస్తుంది. కాని ఇందులోకి వెళ్లడం అంత ఈజీ కాదు. రాళ్లతో నిర్మించిన మెట్లు ఉన్నాయి. రెండు వైపులా భారీ ఇనుప గొలుసులు ఏర్పాటు చేసారు. వాటిని పట్టుకుని మెల్లగా గుహలోకి దిగాలి. ఏమాత్రం పట్టుతప్పినా.. ప్రమాదం పొంచి ఉంటుంది. గుహలోపలికి వెళ్లగానే నాగలోకంలోకి వెళ్లిన ఫీలింగ్ కలుగుతుంది. గుహ ఎంతో విశాలమైంది. 130 మీటర్ల వెడల్పు ఉంటుంది. పాతాళంలోకి ప్రవేశించగానే శేషనాగు ఆకృతి.. దానిపై విశాలమైన అర్ధాకృతిలో చత్రంలాంటి గోళాకృతి ఉంటుంది.
శ్రీ మహా విష్ణువు ఇక్కడ శేష తల్పం పై నిద్రిస్తున్నట్లు కనిపిస్తుంది. శేష నాగు నోటిలో కోరల్లాంటి నిర్మాణాలు ఉంటాయి. విష గ్రంధులు కూడా కనిపిస్తాయి. ఇదంతా వింటుంటే ఓ కథలా అనిపిస్తుంది. నిర్జీవంగా పడి ఉన్న ఈ ఆనవాళ్లన్నీ సజీవంగా కనిస్తాయి. శేషనాగుతో పాటు వాసుకీ మహాసర్పం కూడా ఇక్కడే ఉంది. ఆ ఆనవాళ్ళూ మనకు కనిస్తాయి. ఇష్టాదారి నాగులు అంటే ఇష్టమైన రూపం ధరించే నాగులు కూడా ఈ నాగలోకంలో ఉండేవని నమ్ముతారు. పురాణ గాధల ప్రకారం ఇక్కడ లెక్కలేనన్ని నాగులు ఉండేవి. ఇక్కడే లక్షలాది పాములని అగ్నికి ఆహుతి చేసారు. దీనిని మనం ఊహిచలేం. దీనికి సంబంధించిన యజ్ఞ గుండం కనిపిస్తుంది. రాజా పరిక్షితుడి కుమారుడు భూమి పై ఉన్న అన్ని సర్పాలను ఇక్కడే అగ్నికి ఆహుతి చేసినట్లు ప్రతీతి. ఈ గుండం ఒక ఆకు ఆకృతిలో ఉంటుంది. ఈ గుండం నుండి తక్షత్ అనే పేరు ఉన్న నాగుపాము తప్పించుకు పారిపోయిందని అంటారు.
పాతాళ భువనేశ్వర్ కు సంబంధించిన వర్ణన స్కంద పురాణంలో ఉంది. మానస ఖండంలోని 103వ అధ్యాయంలో ఉండటం విశేషం. పురాణాల్లో చెప్పింది.. పాతాళ భువనేశ్వర్ లో ఉన్నదీ ఒక్కటేనని.. ఇదే నిజమైన నాగలోకం అని… అంతేకాదు శివుడితో సహ 33 కోట్లమంది దేవతలకు నిలయమనేది కొందరి విశ్వాసం. శివలింగం కూడా ఈ గుహలో చూడవచ్చు మనం. సూర్యవంశ రాజు తిరుపర్ని.. త్రేతాయుగంలో ఈ గుహను కనుగొన్నట్లు స్కందపురాణం చెబుతుంది. ఇక ద్వాపర యుగంలో పాండవులు ఇక్కడే చివరిసారి ధ్యానం చేసి హిమాలయ పర్వాతారోహణ చేసినట్లు పురాణాల్లో ఉంది. కలియుగంలో క్రీస్తు శకం 1191లో కూడా ఆది శంకరాచార్యులు కూడా ఈ గుహను సందర్శించినట్లు ప్రతీతి. వీటిలోని రహస్య మార్గం కైలాస పర్వతానికి చేరుకుంటుందని విశ్వసిస్తారు. ఈ గుహలను దర్శిస్తే మహా పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. భూలోకంలోనే నాగలోకం ఉంది.