*సాష్టాంగ నమస్కారం ....*

P Madhav Kumar



సాష్టాంగ నమస్కారము లేదా అష్టాంగ నమస్కారం అంటే మానవునికి వున్న ఎనిమిది అంగాలతో నమస్కారం చేయడం అని అర్ధము..


ఉరసా శిరసా దృష్ట్యా మనసా

వచసా తథా పద్భ్యాం కరాభ్యాం

కర్ణాబ్యామ్ ప్రణామో ష్టాంగ ఈరితః..


అష్టాంగాలు అంటే.. అవి ఏవి అనేది ఇప్పుడు పరిశీలిద్దాం..


1. "ఉరసా " అంటే తొడలు అని అర్థం.


2. "శిరసా " అంటే తల అని అర్థం.


3. "దృష్ట్యా " అనగా కళ్ళు అని అర్థం.


4. "మనసా " అనగా హృదయం అని అర్థం.


5. "వచసా " అనగా నోరు అని అర్థం.


6. "పద్భ్యాం " అనగా పాదములు అని అర్థం.


7. "కరాభ్యాం " అనగా చేతులు అని అర్థం.


8. "కర్ణాభ్యాం " అంటే చెవులు అని అర్థం.


ఇలా మన ఎనిమిది అంగాలతో నమస్కారం చేయాలి. మనం చేసే నమస్కారం ఇలా 8 అంగములతో కూడినదై ఉంటుంది కాబట్టి దాన్ని అష్టాంగ నమస్కారం అంటారు.


మానవుడు సహజంగా ఈ 8 అంగాలతోనే తప్పులు చేస్తుంటాడు. అందుకే దేవాలయంలో బోర్లా పడుకుని పై శ్లోకం చదువుకుంటూ దేవునికి నమస్కరించి ఆయా అంగములు నెలకు తగిలేలా నమస్కరించాలి..


ముఖ్యంగా దేవాలయంలో సాష్టాంగ నమస్కారం దేవునికి, ధ్వజ స్తంభానికి మధ్యలో కాకుండా ధ్వజ స్తంభం వెనుక వుండి చేయాలి.


1) ఉరస్సుతో నమస్కారం చేయడం అనగా నమస్కారము చేసేటపుడు ఛాతీ నేలకు తగలాలి.


2) శిరస్సుతో నమస్కారం చేయడం అనగా నమస్కారం చేసేటపుడు నుదురు నేలకు తాకాలి.


3) దృష్టితో నమస్కారం చేసేటపుడు కనులు రెండు మూసుకుని మనం ఏ దేవునకు నమస్కారం చేస్తున్నామో ఆ దేవుని మూర్తిని చూడగలగాలి.


4) మనస్సుతో నమస్కారం చేయడం అనగా ఏదో మొక్కుబడికి నమస్కారం చేయడం కాకుండా మన:స్పూర్తిగా చేయాలి.


5) వచసా నమస్కారం చేయడం అంటే వాక్కుతో నమస్కారం.. అంటే.. నమస్కారం చేసేటపుడు ప్రణవ సహితంగా ఇష్ట దైవాన్ని మాటతో స్మరించాలి. అంటే "   ఓం నమో భగవతే వాసుదేవాయ అని అంటూ నమస్కారం చేయాలి.


6) పద్భ్యాం నమస్కారం చేయడం అంటే నమస్కార ప్రక్రియలో రెండు పాదములు కూడా నేలకు తగులుతూ ఉండాలి.


7) కరాభ్యాం నమస్కారం చేయడం అంటే నమస్కారం చేసేటపుడు రెండు చేతులు కూడా నేలకు తగులుతూ ఉండాలి.


8) జానుభ్యాం నమస్కారం చేయడం అంటే నమస్కారం చేసేటపుడు రెండు మోకాళ్ళు కూడా నేలకు తగులుతూ ఉండాలి..


   అయితే ముఖ్యంగా స్త్రీలు సాష్టాంగ నమస్కారం చేయకూడదు. ఆడవాళ్లు కేవలం పంచాంగ నమస్కారం మాత్రమే చేయాలి. అంటే కాళ్లు, చేతులు, నుదురు మాత్రమే నేలకు తాకేలా స్త్రీలు నమస్కారం చెయ్యాలని మన శాస్త్రం చెబుతుంది. 

స్రీలు సాష్టాంగ నమస్కారం చేయాలంటే ఉదరం నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. ఇలా చేయ్యటం వల్ల గర్భకోశానికి ఏమైనా కీడు జరిగే అవకాశం ఉంటుదనే మన వారి దర్మ శాస్త్రాల్లో స్త్రీలను మోకాళ్ళపై ఉండి నమస్కరించాలని సూచిస్తున్నారు.


పూజ పూర్తయిన తరువాత మంత్ర పుష్పాన్ని భగవానుడికి భక్తితో సమర్పించుకునే సందర్బంలో సాష్టాంగ నమస్కారం లేదా పంచాంగ నమస్కారం చెయ్యాలి. దైవానికి, గురువులకు, యతులకు వారు నీకు ఎదురు పడిన వెంటనే సాష్టాంగ నమస్కారం చేయాలి. నూరు యజ్ఞాలు చేయడం వల్ల కూడా పొందలేని ఉత్తమ గతులను సాష్టాంగ నమస్కారం చేసేవాళ్లు పొందుతారని శాస్త్రవచనం.. 





🙏🙏🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat