బ్రహ్మ హత్య పాపము

P Madhav Kumar

 **


ఒకరోజు దేవలోకంలో దేవేంద్రుడు సభలో కొలువుదీరి వున్నాడు. ఆ సమయంలో దేవతలకు గురువైన బృహస్పతి ఇంద్రుని సభకు వచ్చాడు. గురువుగారిని చూసినా కూడా ఇంద్రుడు అహంభావ పూరితుడై సింహాసనము నుండి లేచి నిలబడి బృహస్పతిని గౌరవించలేదు. ఆ అవమానాన్ని బృహ స్పతి సహించలేకపోయాడు. అయినా కూడా అక్కడ ఏమీ మాట్లాడకుండా, గొడవ చేయకుండా మౌనంగా బయ టకు వచ్చేస్తాడు. తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.


ఆ తర్వాత ఇంద్రుడు తన తప్పును తెలుసుకుంటాడు. "అయ్యో! గర్వముతో నా కుల గురువును అవమానపరిచా ను. తక్షణమే వెళ్ళి ఆయన పాదాలపై పడతాను. క్షమాపణ వేడుకుంటాను" అనుకున్నాడు. ఎంత వెతికినా గురువు ఎక్క డా కనిపించడు. బృహస్పతి అదృశ్యుడయ్యాడు.


"గురువు బృహస్పతి కనిపించకపోవడంతో ఇంద్రుడు నిస్సహాయుడయ్యాడు"అన్న వార్త నలుదిక్కులా వ్యాపించిం ది. ఇదే అదను అని తలచి రాక్షసులు తమ గురువైన శుక్రాచా. రుడు సలహాపై స్వర్గలోక ప్రభువైన ఇంద్రునిపై యుద్ధము ప్రకటించారు. రాక్షసులకు, దేవతలకు నడుమ జరిగిన యు ద్ధంలో దేవతలు చిత్తుగా ఓడిపోయారు.


ఇంద్రుడు బ్రహ్మగారి సలహాపై విశ్వకర్మ కుమారుడైన విశ్వరూపుని వద్దకు వెళ్ళాడు. విశ్వరూపుని తమకు గురువు గా ఉండవలసినదిగా ప్రార్ధించి నమస్కరించాడు. విశ్వరూపు డు గురువుగా వుండటానికి అంగీకరిస్తాడు.


ఇంద్రుడు విశ్వరూపుడు గురుత్వము వహించగా ఒక యజ్ఞం చేస్తాడు. ఇంద్రునికి గురువుగా వున్న విశ్వరూపుడు యజ్ఞ హవిస్సును ఆయా దేవతలకు ఆవాహన చేయవలసి వచ్చెను. విశ్వరూపుడు అసుర జాతికి చెందిన వాడగుట చేత, సహజముగా అసురుల యెడ పక్షపాత వైఖరి గలవాడు కదా! అందుకే చిత్రమైన తంత్రమును ఉపయోగించి, యజ్ఞ హవి స్సు అసురులకు చేరునట్లుగా మంత్రముల నుచ్చరించి ఆవా హన చేస్తాడు.


. ఇంద్రుడు గురువు చేస్తున్న మోసాన్ని కనిపెడతాడు. బ్రహ్మ ముందుగానే ఇటువంటి జరుగగలదని ఇంద్రునికి హెచ్చరించి, దానిని సహించవలెనని చెబుతాడు. కాని ఇంద్రుడు గురువు చేస్తున్న మోసాన్ని చూసి సహించలేకపోతాడు.


విశ్వరూపునకు మూడుతలలుంటాయి. వాటితో అతడు ధూమపానం, సురపానం, అన్న భోజనం చేసేవాడు. ఇంద్రుడు తన ఖడ్గము తీసుకుని విశ్వరూపుని మూడు తలలు నరికి వేస్తాడు. మూడింటిలో 'సోమపేతము' అనే తలను మొట్ట మొదటి నరికి వేస్తాడు. ఆ తలతో సోమరసమును త్రాగు చుండుట చేత ఆ తలకు 'సోమపేతమను పేరు వచ్చింది. ఈ తల శరీరము నుండి విడివడగానే కపింజల అనే పక్షిగా రూపొందుతుంది.


రెండవ శిరస్సు సురసు త్రాగుటచే 'సురపేత మను పేరు వచ్చింది. ఆ తలను నరికి వేయడంతో ఆ తల కళావింగమను పేరుగల పక్షిగా మారుతుంది.


మూడో తల అన్నము తినుట చేత అన్నదం అను పేరు పడింది. ఈ తల తిత్తిరి పక్షి అవుతుంది.


బ్రాహ్మణుని తలలు నరుకుట చేత ఇంద్రుడు బ్రహ్మ హత్యా పాతకమునకు గురవుతాడు. ఒక ఏడాది ఇంద్రుడు బాధపడాల్సి వస్తుంది. ఒక సంవత్సరము తర్వాత యజ్ఞము. ద్వారా కొంత దోషాన్ని తొలగించి, మిగిలిన ఆ దోషాన్ని మూడు భాగాలు చేసి దోషాన్ని పుచ్చుకున్న వారికి కోరిన వర మిస్తానని చెబుతాడు.


ఒక భాగాన్ని పృథ్వి తీసుకుంది. అందుకుగాను ఇంద్రు డును ఓ వరం అడిగింది. భూమిపై ఎవరైనా ఎక్కడైనా తవ్వి నాకొన్ని రోజులకు ఆ భూమి సమమయ్యేలా కోరింది. అలాగే అని ఇంద్రుడు వరమిచ్చాడు.


వృక్షాలు రెండో భాగాన్ని పుచ్చుకున్నాయి. కొన్ని కొమ్మ లు నరికినావృక్షం మృతి చెందక మళ్ళీ వేరే శాఖలు మొలిచేలా. వరాన్ని పొందింది.


మూడో భాగాన్ని స్త్రీలు తీసుకొన్నారు. దానికి బదులుగా స్త్రీలు పుత్రోత్పత్తి సామర్ధ్యాన్ని వరంగా పొందారు.


అందువల్ల స్త్రీలకు రజస్వల కాలంలో బ్రహ్మ హత్య దోషము ఉంటుంది.


భూమి, వృక్షములు, స్త్రీల దయతో ఇంద్రుడు బ్రహ్మ హత్య పాపము నుండి విముక్తుడవుతాడు.


"పశ్చాత్తాపముతో నారాయణుని పూజించి, కీర్తించు టచేమహాపాతకములైన బ్రహ్మ హత్య, గోహత్య, పితృహత్య, మాతృ గురు హత్యల నుండి మానవుడు విముక్తుడగును" అని ఋషులు ఇంద్రునితో చెబుతారు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat