శ్లో𝕝𝕝 ఏకో దేవః సర్వభూతేషు గూఢః
సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా
కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః
సాక్షీ చేతా కేవలో నిర్గుణశ్చ ౹౹
*(శ్వేతాశ్వతర ఉపనిషద్/౭/౨)*
తా𝕝𝕝 అన్ని ప్రాణులయందు నిగూఢంగా దాగియున్న భగవంతుడొక్కడే.....
అతడే సర్వవ్యాపి...
సమస్త ప్రాణులకు అంతరాత్మ....
సమస్త కర్మలకు ఫలప్రదాత....
సమస్త ప్రాణులకు అంతర్యామి....
అన్ని కర్మలకు సాక్షి....
జ్ఞాన స్వరూపుడు.... సజాతీయ విజాతీయ స్వగతభేదశూన్యుడు....
అంటే అతనితో సమానమైన వాడు మరొకడు లేడు.....
అతని కంటే ఇతరుడు మరొకడు లేడు....
అతనిలో ఎటువంటి విభాగము లేదు.....
అతడు గుణాతీతుడు....
శుద్ధచైతన్య స్వరూపుడు.... 🙏