శ్రీ ధర్మశాస్తా అష్టోత్తర శత నామావళి భాష్యము

P Madhav Kumar


1. *మహాశాస్తే* :-  మహాశాస్తాని పొగడునది. మహాశాస్తా అని పిలువబడుచూ శాస్తా యొక్క మూల మంత్రము


2 *మహాదేవ* :-  శ్రీశాస్తా సాక్షాత్తూ మహాదేవ స్వరూపుడు.


3. *మహా దేవ సుత* :- మహాదేవుని పుత్రుడు.


4. *అవ్యయా* :- నాశనము లేనివాడు.


5. *లోక కర్త్రే* :-  లోకమును సృజించినవాడు


6. *లోక భర్త్రే* :- లోకమును కాపాడువాడు


7. *లోక హర్త్రే* :-  లోకమును నాశనము చేయువాడు


8. *పరాత్పర* :- పరమాత్మ. తనకు ఏ కారణము లేనివాడు. కానీ లోకమునకు కారణజన్ముడు నిత్యుడు అనాది ముక్తడు అగుట వలన పరమాత్మ


9. *త్రిలోక రక్షక* :- ముల్లోకములను కాపాడువాడు.


10. *ధన్వినే* :- విల్లు ఎక్కుపెట్టినవాడు


11. *తపస్వినే* :- తపస్సు చేయువాడు


12. *భూతసైనిక* :- భూత సేనాని , భూత గణములు గలవాడు.


13. *మంత్ర వేది* :- అన్ని మంత్రములను తెలిసిన వాడు. కాబట్టీ ఇతరులకు బోధించగలుగు గురువుగా అర్హతను పొందినవాడు.


14. *మహా వేదిన్* :- అన్ని వేదములను తెలిసినవాడు.


15. *మారుత* :- వాయువువలె సంచరించువాడు.


16. *జగదీశ్వర* :- ఈశ్వరునివలె ముల్లోకములను కాపాడువాడు.


17. *లోకాధ్యక్ష* :- ప్రజలకు నాయకత్వము వహించువాడు.


18. *అగ్రగణ్య* :- అన్నిటియందూ మేలైనవాడు.


19. *శ్రీమతే* :- ఐశ్వర్యవంతుడు. సకల సంపదలను పొందియున్నవాడు. అతడివద్ద లేనిదంటూ ఏదీ లేదు. 


20. *అప్రమేయ పరాక్రమ* :- చెప్పలేనటువంటి పరాక్రమమును కలిగినవాడు.


21. *సింహారూఢ* :-  సింహమును అధిరోహించి యుందువాడు


22. *గజారూఢ* :-  ఏనుగుపై ఉరేగువాడు శాస్తాకి ఎన్నియో వాహనములు ఉన్ననూ , ఏనుగుపై అథరోహించి యుండుటనే ఇష్టపడు వాడగుటచేత గజవాహనుడు అని పిలుచుట శ్రేష్టము.


23. *హయారూఢ* :- అశ్వము పై ఊరేగువాడు


24. *మహేశ్వర* :- కాలాగ్ని రుద్రుని వలన ప్రళయకాలమున ప్రపంచము నశించిపోయినప్పుడు మహేశ్వరుడు పునఃసృష్టి జరుగునంత వరకూ కాపాడు నట్టివాడు కావున మహేశ్వర నామధేయము పొందినవాడు. అతడు పరమకారుణ్య మూర్తి యని శైవ శాస్త్రములు పేర్కొనచున్నాము.


25. *నాన శస్త్ర ధర* :-  పలువిధములగు ఆయుధములను ధరించినవాడు. ఆయుధములను నని శస్త్రములు , అస్త్రములను రెండు విధము కలవు. శస్త్రము అనునది మంత్రబలముతో కాక , శారీరక బలము లేదా ఒక ప్రత్యేక ఉపకరణము ద్వారా సంధించబడునది. అస్త్రము అనునది మంత్ర ఉచ్ఛాటనతో కూడుకున్నిటై బాణముల ద్వారానో , గడ్డిపరక ద్వారానో కూడ సంధించబడును.


26. *అనర్ఘ* :- వెలకట్టలేని వాడు.


27. *నానా విద్యా విశారద* :- అనేక కళలయందు నిపుణుడు. మన పూర్వులు అష్టాదశ విద్యలను 18 రకములుగా విభజించిరి. ఋగ్ , యజుర్ , సామ , అధర్వణ వేదములు 4, ధనుర్ , ఆయుర్ , గాంధర్వ వేదము , అర్థశాస్త్రము అను ఉపవేదములు 4, శిక్ష , కల్పము , వ్యాకరణము , ఛందస్సు , జ్యోతిషము , తర్కశాస్త్రము అను వేదాంగములు 6, మీమాంశ , న్యాయ , ధర్మ శాస్త్రములు , 18 మహా ఉప పురాణములు కలసినది 1, మొత్తము 4 - ఇట్లు 18 విద్యలు.


28. *నానారూపధర* :-  పలు విధములగు రూపములను ధరించువాడు.


29. *వీర* :-  వీరుడు. పలువిధములగు దుష్ట శక్తులను సంహరించిన తల్లి తండ్రులకు జన్మించిన యుద్ధ వీరుడు. వీర అనగా తన సామర్థ్యమును చూపువాడు అని పాణినీయ ధాతు గ్రంథమున వివరించబడినది. వీరము అనగా వీర్యము మగతనము. ధైర్యము , దేహబలము అని అర్థము. వీరులలో దానవీరుడు , ధర్మ వీరుడు , దయావీరుడు ఇట్లు పెక్క విభములు కలవు. అన్నిటికీ కలిపి మొత్తముగా స్ఫురించు అర్థము వీర అనునది. యుద్ధ వీరుడు,


30. *నానాప్రాణి నివేషవక* :- లోకము నందుండు సహస్త జీవరాశులచే స్తుతింప బడువాడు. ఆలోచనా శక్తి లేని పలు రకములైన ప్రాణులు భగవంతుని పూజించి అతడి అనుగ్రహమునకు పాత్రలైన సంఘటనలు మనకు పురాణములలో అనేకము కనిపించును. ఏనుగు , కస్తూరి జింక , పాము ఇటువంటివి స్వామిని సేవించి ముక్తిని పొందినట్లుగా మనకు అనేక ఋజువులు కలవు.


31. *భూతేశాయ* :-  క్రూరగుణముగల భూతములకు నాయకుడు. భూత అనుదానికి భూత సైన్యములు . భూత గణములు , సమస్త జీవరాశులు , బ్రహ్మాండములు అను అర్థములు కలవు. వాటినీ శాస్తా కాపాడువాడైనందువల్ల భూతేశుడు అని పిలువ బడుచున్నాము.


32. *భూతిత* :- సమస్తమును ప్రసాదించువాడు. జీవనముకు కావలసిన సంపద , సంతోషము , అభివృద్ధి , గెలుపు , ధైర్యము , సౌభాగ్యము , మర్యాద వీటన్నిటికి భూతి అను అర్థము కలదు. వాటిన్నటినీ ప్రసాదించువాడు.


33. *బృత్యా* :-  పోషించువాడు. మిగతా దేవతలను సేవకులుగా కలిగినవాడు.


34. *భుజంగాభరణోత్తమ* :- పామును ఆభరణముగా ధరించువాడు.


35. *ఇక్షుతన్వినే* :-  చెరకు విల్లును చేబట్టినవాడు. చెరకు విల్లును మన్మథుని వలె చేతియందు బూనినవాడు. 


36. *పుష్ప బాణ* :-  పుష్పములను బాణములుగా ధరించినవాడు. తామర పూవు , మామిడి , అశోక , ముల్ల , నీలోత్పలము అను ఐదు పుష్పములను బాణములుగా కలవాడు. పుష్పములను చేతపట్టి , వాటి ద్వారా ప్రాణ కోటి సంతతిని సృష్టి చేయ నెంచినవాడు.


37. *మహా రూప* :-  పెద్దదైన రూపమును కలవాడు.


38. *మహా ప్రభు* :-  మహా ప్రభువు.


39. *మాయా దేవీ సుత* :-  మాయాదేవి యొక్క పుత్రుడు. శ్రీమహావిష్ణువు మాయారూపము ధరించిన మోహిని అవతారము ద్వారా జన్మించినవాడు. 


39. *మాయాదేవి* :- శ్రీకృష్ణుని సోదరియైన విష్ణుమాయ అను దుర్గాదేవి. యోగ మాయ అను భువనేశ్వరి. దక్ష యోగమును నాశనము చేసిన పార్వతి తన మాయచే ధరించబడిన కాళికాదేవి (త్రికూటాం , త్రిపురాం , వరమాం , మాయం , శ్రేష్టాం , వరాం , వైష్ణవీం అంటూ పరాశక్తిని త్రిపురాధాభిని ఉపనిషత్తు వర్ణించుచున్నది.


40. *మాన్య* :-  మర్యాద చేయదగువాడు. ఈ కలికాలమునందు ప్రత్యక్ష దైవము , కలియుగ వరదుడు , వరమ కారుణ్యమూర్తి , కోట్లాది భక్తులను తన వైపునకు ఆకర్షించు నట్టి మోహనరూపుడైన శబరిమల అయ్యప్ప స్వామికి ఈ నామము సార్థకమైనది.


41. *మహా నీత* :-  మనలను మంచిగా నడిపించువాడు.


42. *మహా గుణ* :-  మేలైన గుణములు కలిగినవాడు.


43. *మహా శైవ* :-  శైవ శ్రేష్టుడు. శివసంబంధము కలిగిన వాడు శైవుడు.


44. *మహా రుద్ర* :-  మహారుద్రుడు. శ్రీశాస్తా ప్రపంచమును తనలో లయించునట్లు చేయునట్టి ప్రళయకాల రుద్రుని అంశ కలిగినవాడు. అష్టమూర్తుల యందు రుద్రుడు ఆకాశ తత్యము కలిగినవాడు. నిరుక్తము నందు రుద్ర శబ్దమునకు అనేక అర్థములు గోచరించు చున్నవి.


45. *వైష్ణవ* :-  వైష్ణవుడు , విష్ణువు యొక్క సంబంధము కలవాడు.


46. *విష్ణు* :- విష్ణువును పూజించువాడు. తల్లియైన మహావిష్ణువును పూజించువాడు. మాతృ దేవోభవ అను అర్థము స్ఫురించునట్లు విష్ణువుని తల్లిగా పూజించువాడు.


47. *విఘ్నేశ* :-  విఘ్నములను తొలగించు వినాయక అంశ కలిగినవాడు. శ్రీ లలితాదేవికి , భండాసురునికి యుద్ధము జరిగినపుడు అతడి సోదరుడైన విశుక్రుడు అనువాడు. సోమరితనము , బలహీనత , నిద్ర , సంకోచము , మైకము , భయము , మందగతి వంటి వాటిని పారద్రోలుటకై , వాటికి సంబంధించిన దైవతలైన అల , కృవణా , దీన , నిద్రా , తంత్ర , ప్రమీలికా , క్లోపా , నిరహంకారా అను పేర్లను ఒక విష్ణుయంత్రము  యందు స్థాపించి , మధ్యగా సంహార బీజమును , అష్టదిక్కులయందు శూలములను స్థాపించి , జపము చేసి , రాత్రియందు ఎవరూ చూడని సమయమున దేవి యొక్క సైన్యములు సేదదీరు గుడారములందు భూస్థాపితము చేసెను. అది తెలిసికొనిన దేవి , కామేశ్వరుని ప్రార్థించినంతట విఘ్నేశ్వర ఉత్పత్తి జరిగినది. ఆ విఘ్నేశ్వరుడు విష్ణు యంత్రమును ఛేదించి వేసెను.


48. *వీరభద్రేశ* :-  శాస్తా ధక్షయాగమును నశింపజేసిన శివుని అంశగలిగిన వీరభద్రస్వరూపి , కర్ణాటక దేశము నందలి బేలవాడి (హుబ్లి) బృహన్ మఠము యొక్క ఆధీనమున నున్న ఈ వీరభద్రునికి ఆలయము ఒకటి కలదు. అదియు కాక మధుర మీనాక్షి ఆలయమున అఘోర వీరభద్రుడు , అగ్ని వీరభద్రుడు అను పెద్ద విగ్రహములు రెండు కలవు.


49. *భైరవ* :- భైరవుని అంశ కలిగిన వాడు.


50. *షణ్ముఖధృవ* :-  ఆరు ఆధార చక్రములుగా భాసిల్లువాడు. శరీరమునగల ఆరు ఆధారములందు నిలచి యుండువాడు. షణ్ముఖము అనునది శరీరము నందలి ఆరు చక్రములను సూచించునది. శ్రీధర్మశాస్తా యొక్క 7 ఆలయుములు , ఆరు ఆధార చక్రములుగాను , సహస్రారము గానూ పేర్కొనబడుచున్నవి. 


1) మూలాధారం - సొరిముత్తయన్ కోయిల్ 


2) స్వాదిష్టానాం - అచ్చన కోయిల్ 


3) మణిపూరకం - ఆర్యంకావు 


4) అనాహతం - కుళత్తుప్పులై


5) విశుద్ధి - పందళం


6) ఆజ్ఞ - శబరిమల


7) సహస్రారం - కాంతమలై



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat