నీతి కథ - భక్తి

P Madhav Kumar

 


ఒకానొక ఊరిలో ఒక చెట్టు కొమ్మ మీద ఒక పక్షి ఉండేది. అది తన పిల్లలు పెద్దవి అవుతుండడంతో బయటకు వెళ్లి ఏదైనా అపాయంలో పడతాయేమోనని భయపడి, ఒకరోజు రెక్కల్ని రెపరెపలాడిస్తూ, ఎగరడానికి ప్రయత్నిస్తున్న పిల్లల్ని చూసి పిల్లలారా..! రండి..! మీకొక మంచి పాట నేర్పిస్తాను అంది..... సంతోషంతో గెంతుకుంటూ వచ్చిన పిల్లలకు..., 


👉 వేటగాడొస్తున్నాడు జాగ్రత్త..! 

👉గింజలు విసురుతాడు జాగ్రత్త..!

👉 వల వేస్తాడు జాగ్రత్త..!

👉 పట్టుకుంటాడు జాగ్రత్త..!

👉 మెడ విరుస్తాడు జాగ్రత్త.. ! 

అనే పాట నేర్పింది.


అతి త్వరలోనే ఆ పాటని చక్కగా నేర్చేసుకున్న ఆ పిల్లలు బహురమ్యంగా పాడటం మొదలుపెట్టాయి.. హమ్మయ్య..! వేటగాడొచ్చినా నా పిల్లలకి ఇంకేం పరవాలేదు అనుకొని వేట కొరకు అడవులలోకి వెళ్ళిపోయింది ఆ తల్లి పక్షి.


ఈలోగా రానే వచ్చాడు వేటగాడు. వాడిని చూడగానే పక్షి పిల్లలు వేటగాడొస్తున్నాడు జాగ్రత్త..! అని పాడసాగాయి. ... అది విన్న వేటగాడు ఆశ్చర్యపోయి చెట్టు చాటున నక్కి పోనీ గింజలు విసిరి చూద్దాం..అని గింజలు విసిరాడు. వెంటనే ఆ పక్షి పిల్లలు గింజలు విసురుతాడు జాగ్రత్త..! అని పాడసాగాయి. మరింత ఆశ్చర్యపడ్డ వేటగాడు ఏంచెయ్యాలో అర్ధం కాక వల వేసాడు. ఈలోగా వల వేస్తాడు జాగ్రత్త..! అని పాడుతూ ఆ పక్షి పిల్లలు అతడు విసిరిన వలపై వ్రాలాయి. పాడుకుంటూ గింజలు తింటున్న పక్షుల్ని ఒక్కక్కటిగా పట్టుకొని మెడ విరుస్తుంటే ఇంకా పాడుతున్న ఆ పక్షులు మెడ వి...రు...స్తా......డు........ అంటూనే చచ్చిపోయాయి.


అయ్యో... ఈ పక్షులు పాట అయితే నేర్చుకున్నాయి గాని...., దాని లోని అర్ధాన్ని గ్రహించుకోలేదు. 


నేడు మనమందరమూ చక్కని దేవుని శ్లోకాలు, పాటలు, మంత్రాలు, పురాణాలు, ప్రవచనాలు, వేదాలు, సహస్ర నామాలు, వింటున్నాము.., చదువుచున్నాము... పాటించకుండా వదిలేస్తున్నాము.  


గాయత్రీ,, మృత్యుంజయ మంత్రాలు మొదలుకొని వేద వేదాంగాలలో ఏకొన్నింటి అర్థం తెలుసుకున్నా మేలు.


గుడ్డిగా ఎవరు ఏది చెప్తే అదే చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవడమే అసలైన భక్తి...... 

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat