రుద్రాక్ష దీపం అంటే ఏమిటి ?

P Madhav Kumar

 రుద్రాక్ష దీపం ఏ రోజు వెలిగించాలి ? రుద్రాక్ష దీపం వెలిగించినందువలన ఫలితం ఏమిటి? 


ఒక ప్రమిదలో రుద్రాక్షలు కొన్ని పెట్టండి. దానిపైన బియ్యం పిండితో చేసిన ప్రమిదను ఉంచి అందులో నూనె కానీ ఆవునేతిని గాని వేసి రెండు ఒత్తులు వేసి, దీపం వెలిగించండి. దీనినే రుద్రాక్ష దీపం అంటారు. ప్రతి సోమవారం రుద్రాక్ష దీపం ఇలా పెట్టడం చాలా మంచిది.


“ప్రదోషకాలే శివనామ స్మరణ సకలపాపహరణం “ ప్రదోషకాలంలో ఇలా చేయడం విశేష ఫలితం ఉంటుంది. త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి అలాగే మీ జన్మ నక్షత్రం రోజున రుద్రాక్ష దీపం పెట్టడం ఆ పరమశివుని ఆశీస్సులు లభిస్తాయి. తీవ్రమైన అనారోగ్యంతో గాని, అప్పులతో ఉన్న వారికి, ఏది ముందుకు సాగకుండా పనులు ఆగిపోయిన వారికి గృహంలో ఈ రుద్రాక్ష దీపం ప్రతి సోమవారం పెట్టడం వల్ల నీ బాధలు సమస్యలు పరిష్కారం అవుతాయి . కుటుంబం లో పిల్లలు ఎవరైనా మొండి వైఖరితో ఉన్నా, లేదా ఇంట్లో ఎవరైనా అతి కోపం మొండితనంతో ఇబ్బంది పెడుతున్న వారి జన్మ నక్షత్రం రోజున రుద్రాక్ష దీపం పెట్టి, పరమేశ్వరునికి కొబ్బరి నైవేద్యం (కొబ్బరి అన్నం అయితే ఇంకా మేలు) పెట్టి శివ స్త్రోత్రాన్ని గాని శివునికి సంబంధించిన ఏ మంత్రాన్ని అయినా, స్తోత్రం అయినా చదివి హారతి ఇస్తూ ఉంటే వారిలో మార్పు కచ్చితంగా వస్తుంది.ఇంకా వారి చేతితో పెట్టిస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.


కొన్ని వారాలు అని లెక్క ఏమీ లేదు ,ప్రతి సోమవారం పెట్టుకోవచ్చు, ఇది ఖర్చు తో చేసేది కాదు కదా. అదే ప్రమిద అవే రుద్రాక్షలు ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు. ఆ పిండి దీపం కొండ ఎక్కగా నీటిలో కలిపి చెట్టుకు పోయవలెను. రుద్రాక్షదీపం పరమ శ్రేష్టం అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికీ ఇష్టమైన దీపం కాబట్టి భక్తిగా వెలిగించి శివానుగ్రహం పొందండి. ఈ రుద్రాక్ష దీపానికి పెద్ద ఖర్చుతో పని గానీ, ఎక్కువ సమయం కేటాయించాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి సోమవారం భక్తితో పది నిమిషాలు ఈ దీపం పెట్టడానికి కేటాయిస్తే మీ జీవితమంతా ఆనందమయంగా అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగి శివ అనుగ్రహం పొందుతారు.




#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat