శబరిమల అయ్యప్ప స్వామి పవళింపు పాట ఎలా పుట్టింది..? ఎవరు రచించారు…? ఎవరు పాడారు..?

P Madhav Kumar

శబరిమల అయ్యప్ప స్వామి పవళింపు సందర్భంగా పాడే పాట వింటే మదిలో ఆనందం తాండవిస్తుంది. అయ్యప్ప భక్తులు హరివరాసనం పేరుతో పిలుచుకునే ఈ పాట ఎంతో మధురంగా ఉంటుంది. శబరిగిరీశుడి సన్నిదానంలో ఈ పాట వింటే తన్మయత్వంలో పులకించుపోతారు. ఇంతకి ఆ పాట ఎలా పుట్టింది..? ఎవరు రచించారు…? ఎవరు పాడారు..? అయ్యప్ప పూజలు చేసిన తర్వాత చివరగా ఈ పాటను పాడటం ఒక సంప్రదాయం. 1920లో కొనకథు జానకి అమ్మ అనే మహిళ రచించారని కొందరు, కుంభకుడి కులత్తూర్ అయ్యర్ రచించారని ఇంకొందరు అంటారు. అయితే 1955లో స్వామి విమోచననంద అయ్యర్ ఈ స్తోత్రాన్ని శబరిమలలో ఆలపించారు.


1950 వ దశకంలో శబరిమల నిర్మాణుష్యంగా ఉండేది. ఆ కాలంలో వీఆర్. గోపాలమీనన్ అనే భక్తుడు స్వామి వారి ఆలయ సమీపంలో నివశిస్తూ ఉండేవాడు. స్వామివారికి ప్రత్యేక పూజలప్పుడు హరివరాసనాన్ని పారాయణం చేసేవాడు. అప్పట్లో ఈశ్వర్ నంభూద్రి ఆలయానికి తాంత్రిగా (పూజారి) ఉండేవారు. తర్వాత గోపాలమీనన్ శబరిమల నుంచి వెళ్లిపోయాడు. ఆయన మరణ వార్తను తెలుసుకుని తీవ్రంగా దుఃఖించిన ఈశ్వర్ నంభూద్రి ఆ రోజు ఆలయం మూసే సమయంలో హరివరాసనం స్తోత్రం పటించాడు. అప్పటి నుంచి శబరిమలలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది.


హరివరాసనం చదువుతున్నపుడు గర్భగుడిలో ఒక్కొక్కదీపం కొండెక్కిస్తారు. చివరికి ఒక్క దీపం మాత్రం ఉంచుతారు. ఇది స్వామివారికి నిద్రపోయేముందు జోల పాట లాంటిది. హరివరాసనం పూర్తయిన తరువాత నమస్కారం చేయవద్దని, స్వామి శరణు అని చెప్పుకోవద్దని అంటారు. ఈ స్తోత్రంలో 8 శ్లోకాలున్నాయి.మరోసారి ఈ పాటను రీ రికార్డింగ్ చేయాలని ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డ్ సన్నద్ధమైంది. ప్రస్తుతం ఆలయంలో వినిపిస్తోన్న ఈ పాటను ప్రముఖ గాయకుడు కేజే ఏసుదాసు ఆలపించిందే. ఆయన ఇతర మతానికి చెందిన వారైనా అయ్యప్ప స్వామి సన్నిధిలో కచేరీలు నిర్వహించి, శబరిగిరీశుడి పట్ల తనుకున్న భక్తిని అలా చాటుకుంటారు.

హరివరాసనం మొత్తం 108 words,365 letters, 8 శ్లోకాలు.1920 కొనకదు జానకి అమ్మ అనే మహిళ రచించారు.1955 లో శ్రీ విమోచనానంధ స్వామీ పాడారు.




హరివరాసనం విశ్వ మోహనం
హరిదదీశ్వరం ఆరాధ్య పాదుకం
అరివి మర్దనం నిత్య నర్తనం
హరిహరాత్మజం దేవ మాశ్రయే 
«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»

శరణ కీర్తనం భక్త మానసం
భరణ లోలుపం నర్తనాలసం
అరుణ భాసురం భూత నాయకం
హరిహరాత్మజం దేవ మాశ్రయే 
«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»

ప్రణయ సత్యకా ప్రాణ నాయకం
ప్రనత కల్పకం సుప్ర భాంజితం
ప్రణవ మందిరం కీర్తన ప్రియం
హరిహరాత్మజం దేవ మాశ్రయే 
«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»

తురగ వాహనం సుందరాణనం
వరగధాయుదం వేద వర్ణితం
గురు కృపాకరం కీర్తన ప్రియం
హరి హరాత్మజం దేవ మాశ్రయే 
«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»

త్రిభువనార్చితం దేవతాత్మకం
త్రినయనం ప్రభుం దివ్య దేశికం
త్రిదశ పూజితం చింతిత ప్రదం
హరిహరాత్మజం దేవ మాశ్రయే 
«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»
భవభయాపహం భావుకావహం
భువన మోహనం భూతి భూషణం
ధవళ వాహనం దివ్య వారణం
హరిహరాత్మజం దేవ మాశ్రయే 
«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»
కల మృదుస్మితం సుందరాణనం
కలభ కోమలం గాత్ర మోహనం
కలభ కేసరి వాజి వాహనం
హరి హరాత్మజం దేవ మాశ్రయే 
«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»
శ్రిత జన ప్రియం చింతిత ప్రదం
శ్రుతి విభూషణం సాధు జీవనం
శృతి మనోహరం గీత లాలాసం
హరి హరాత్మజం దేవ మాశ్రయే 

«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»«»


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat