ఓం ఓం అయ్యప్ప శరణాలు అయ్యప్ప
శరణాలు శరణాలు అయ్యప్పకు శరణాలు
కొండవాడు మా అయ్యప్పా
జాలి గుండె వాడు మా అయ్యప్పా
ఓహో హో అయ్యప్పా శరణమో అయ్యప్పా ..2.. ||కొం||
1. నీలాల నింగిలోన చుక్కల్లో చందురుడు
నీలగిరి కొండల్లో కొలువుతీరి ఉన్నావు
నీలకంఠుని పుత్రుడు అయ్యప్ప
మణికంఠ నామదేయుడు ఓహో.. ||కొం||
2. రాగాలేమాకురావు తాళాలు మాకు లేవు
అరుపులే మా పిలుపులు అయ్యప్ప
శరణాలే మేలుకొలుపులు ఓహో… ||కొం||
3. పెద్దదారిలోన నడిచి వెళ్ళుతుంటే
– చిన్నదారిలోన నడచి వెళ్ళుతుంటే
దారిలోన కనిపిస్తాడు అయ్యప్ప
శరణాలే పలికిస్తాడు ఓహో.. ||కొం||