శ్యామ సుందరంటి / Shyama Sundarantivole

P Madhav Kumar

 శ్యామ సుందరంటి వాలే ఓ మురళి వాలే

ఓ మురళవాలే ఓ బన్సీ వాలే (2)


నల్ల నల్లనివాడు మూడు నామాలవాడు 

మూడు నామాలవాడు ఏ మూల దాగినాడు 

ఏ మూల దాగినాడు ఏ మంద కేగినాడు

చూడమ్మా అరే చూడమ్మా అరే చూడమ్మ యశోదమ్మా మీ వాడి అల్లరి

 మా వాడు మా ఇంట లేడే ఓ భామలారా

 ఓ భామలారా ఓ చెలియలారా

 (శ్యామ సుందరంటి వాలే ) 


గొల్ల వాడల్లోన వెన్న దొంగిలించినాడు 

వెన్న దొంగిలించినాడు  భామలతో ఆడినాడు 

యశోదమ్మ ఇంటిలోన ఏ మూల దాగినాడు 

చూడమ్మా, అరే చూడమ్మా (2)


మావాడు మాఇంట లేడే ఓ భామలారా

 ఓ భామలారా, ఓ చెలియలారా 

(శ్యామ సుందరి వాలే)

కాళింగ మడుగులోన తకధిమితక లాడినాడు 

తకధిమితక లాడినాడు ఏ మంద కేగినాడు

 గోవర్ధనగిరి ఎత్తి ఏ మూల దాగినాడు

చూడమ్మా అరే చూడమ్మా యశోధమ్మా మీ వాడి అల్లరి

 (శ్యామ సుందరి వాలే )


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat