*స్వామి వావరు స్వామి ఎవరు అయ్యప్పస్వామి కి అతను ఎలా మితృడు అయ్యాడు మనం శభరిమల వెళ్ళే ముందు వావరుని ఎందుకు దర్శణం చేయాలి మసీద్ కి వెళ్ళడం కరెక్టా అయిన 41 రోజులు అయ్యప్పస్వామి దీక్ష చేసి ముందు మసీదు లోకి వెళ్ళడం దేనికి*
వావారు కాదు స్వామి వాబురన్.
అయ్యప్ప స్వామి ఐదుగురు (1.కడుత్త స్వామి,2.కరుప్ప స్వామి,3.కడురవన్,4.కొచ్చు కడుత్త స్వామి,5.వాబురన్) శివ బూత ఘనాలలో ఒకరు.
వీరు కూడా అయ్యప్ప స్వామి వలె జన్మించి.జన్మ రీత్యా అయ్యప్ప స్వామి వారికి తోడుగా వున్నారు అనేది శాస్త్రం.
కట్ చేస్తే
వాబురన్ తన తమ్ముడిని చంపాడన్న పగతో ఉదయన్ అనే ఒక దొంగ వాబురన్ ను చంపేస్తాడు.
ఆ తరువాత టిప్పు సుల్తాన్ ల కాలం లో ముస్లీం మతం తీసుకొని వారిని చంపేయమని ఆజ్ఞ రావటంతో కొంతమంది ముస్లీం మతం స్వీకించటం జరిగింది.అలా మత మార్పిడి స్వీకరించిన వారి లో వాబురన్ వంశస్తులు కూడా ఒకరు. వారి రక్షణ కోసం వారు ఒక మసీదు నిర్మాణం చేసుకోవటం ...అలా కాల క్రమేణా వాబురన్ అనే శివ బూతగణం వావరు స్వామిగా పిలవటం జరుగుతోంది.
అయితే ఇరుముడితో దర్గా లోకి వెళ్ళటం అనేది ఏ శాస్త్రం లో లేదు అని, వెళ్ళ కూడదు కూడా అని మా గురుస్వామి మాకు బోధించిన విషయం.
అయితే ఎరుమేలి వెళ్లిన తరువాత మసీదు కు ఎదురుగా ధర్మశాస్త గుడి ఉంది అక్కడ వాబురన్ స్మరిస్తే చాలు.