ముద్రవాడి పరమార్థం?

P Madhav Kumar



ముద్రవడి అనుసరించాల్సిన పద్ధతులు? 


ముద్రవాడి ఎంతో పవిత్రంగా గురువు తన శిష్యుడికి  18 సంవత్సరాలు శబరిమల యాత్ర పూర్తి అయిన పిదప ఇవ్వవలసిన పవిత్ర దండము దానిని స్వీకరించిన శిష్యుడు ఎంతో పవిత్రంగా ఆ మంత్ర దండమును పూజిస్తూ సాక్షాత్ అయ్యప్ప స్వరూపంగా భావించి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాలి.


ముద్రవాడిని ప్రధానం చేసే గురువుకు ఆ అర్హత ఉండాలి ఆ గురువు గారు తన జీవితాన్ని అయ్యప్ప స్వామి వారికి అంకితం చేసి ఉండాలి జీవితాంతం అయ్యప్ప స్వామి వారు నిర్దేశించిన నియమాలు పాటిస్తూ ఉండాలి

ముద్రవాడి అనగా పడి కొమ్ము అని అంటారు.


 (కొందరు పొన్ను కర్ర అంటారు.)


ఇక వివరాల్లోకి వెళితే అడవుల్లో అరుదైన వృక్షానికి చెందిన కర్రతో ముద్రవాడి తయారవుతుంది. ఆ చెట్టు కొమ్మకు సహజంగానే పిండి ఉంటుంది ఆ చెట్టు కర్ర ను సేకరించి మండల కాలం పూజ చేసి ధర్మశాస్తా వారి శ్లోకాలు పట్టిస్తూ పునీతం చేస్తారు. ఆ శబరిమల లోని స్వామి సన్నిధానంలో త్రికరణశుద్ధిగా పూజించి నియమావళి అనుసరిస్తూ భక్తుడికి దానిని ప్రధానం చేయాలి .


పూర్వం కేరళ అడవుల్లో సత్య శీలన్ అనే ఒక యువకుడు నివసించేవారు అతనికి పరశురాముడి దగ్గర శిష్యరికం చేయాలని ఆశగా ఉండేది తన లాంటి ఖిల్లు జాతి యువకుడిని శిష్యుని గా స్వీకరించారు.  అని తెలుసు ఆ యువకుడు పరశురాముని వద్ద బ్రాహ్మణుడు అని చెప్పి పరశురాముని వద్ద శిష్యుడిగా చేరాడు. అయితే ఆ యువకుడు సూతుడని  తెలియగానే పరశురాముడు ఆగ్రహించి తాను నేర్పిన విద్యలన్నీ అవసరం కలిగినప్పుడు గుర్తుకు రాకుండా గాక అని శపించారు. అందుకే సత్య శీలన్ అనే యువకుడు ఎప్పుడు పరశురాముడు తారసపడిన దూరంగా అనుసరిస్తూ ఉండేవారు

ఆ యువకుడి తపనను పరశురాముడు  గమనించి ఒకసారి అతన్ని పిలిచి నాయనా నీ ఉద్దేశం నాకు తెలుసు ఇప్పుడు ఎవరినైనా శిష్యుడిగా స్వీకరించడానికి అభ్యంతరాలు లేవు. అయితే నేను విద్యాబోధనలు చేయడం మానేశాను నువ్వు శ్రీ ధర్మశాస్తా అవతారమైన స్వామిని ఆరాధించు నీకు శుభం కలుగుతుంది. అని చెప్పారు పరశురాముడు ఆ యువకుడు పరశురాముడు చెప్పిన మాటలకు ఎంతో సంతోషించాడు. పరశురాముడు తన గండ్రగొడ్డలిని విసిరి పారేసి అది పడిన చోట శ్రీ ధర్మశాస్తా ను అయ్యప్ప స్వామి వారి రూపాలను మట్టితో నిర్మించి ఆరాధించారు. పరశురాముడు విసిరేసిన గండ్రగొడ్డలి పడిన స్థలం పేరు *పరసు లిక్కల్* గ్రామం ఇప్పుడు కేరళ లో ఉంది ఆ యువకుడి భక్తికి సంతోషించిన పరశురాముడు ఒకసారి అటుగా వెళుతూ కాంతమలకు వెళ్లి అక్కడ స్వర్ణ మందిరం లో ఉన్న ధర్మశాస్తా వారిని దర్శించమని సత్య శీలన్ కు పరశురాముడు చెప్పారు అంతేకాదు పరశురాముడి దగ్గర ఉన్న అరుదైన దండాన్ని ఆ యువకునికి ప్రధానం చేశాడు దానినే మనం ముద్రవాడి  అంటున్నాం. ఈ కర్రకు కొన్ని వలయాలు చుట్టి పరశురాముడు  బాబు ఒక్కొక్క వలయం నీకు అయ్యప్ప యాత్రలో ఉన్న ఒక్క నియమానికి చిహ్నము ధర్మశాస్తా వారిని చేరడానికి అధిగమించాల్సిన 18 సోపానాలకు సంకేతం దీన్ని చేతభూని నియమాలు పాటించినట్లయితే నీవు అరణ్యం గుండా సురక్షితంగా ప్రయాణించి కాంతామలకు  చేరుకోగలవు అని ఆశీర్వదించారు.


అప్పుడా ముద్రవాడితో ఆ యువకుడు కాంతమల చేరి ధర్మశాస్తా అయిన అయ్యప్ప స్వామి వారిని దర్శించి ముక్తి పొందాడు.


గతంలో ఒకసారి శబరిమల సన్నిధానం అగ్నికి ఆహుతై స్వామివారి విగ్రహం ధ్వంసం అయినప్పుడు స్వామి వారి భక్తులు స్వామివారి రూపం కనబడక తల్లడిల్లిపోయారు అప్పుడు శబరిగిరి ప్రాంతంలో ఒక గొప్ప భక్తుడు స్వామివారు ఉండేవారట ఆ భక్తుడు బ్రహ్మచారి ఆ భక్తుడికి కలలో అయ్యప్ప స్వామి వారు కనిపించి శబరిమల ప్రాంతం చుట్టూ పక్కల గల అరణ్యంలో సహజసిద్ధమైన పిండి కలిగిన చెట్టు కొమ్మలను తన భక్తులకు ప్రధానం చేయమని అయ్యప్ప స్వామి వారు కలలో చెప్పారట అప్పుడు ఆ భక్తుడు స్వామి ఏమిటి ఆ కర్ర లో విశేషము అని అయ్యప్ప స్వామి వారిని అడిగాడు దానికి స్వామి వారు ఆ కర్ర నా ప్రతిరూపమే దానిలో నా అంశ ఉంటుంది నా విగ్రహము  పున ప్రతిష్ఠ జరిగేదాకా నా నిజమైన భక్తులు ఈ కర్ర నే ఆరాధించి తృప్తి చెందుతారు నా ముద్ర బలంగా ఉన్న దండము కనుక దానిని ముద్రవాడి అని పిలుస్తారని స్వామి వారు చెప్పారట.

దాంతో ఆ వృద్ధ భక్తుడు అడవిలో గాలించి సహజసిద్ధమైన పిండి గల కొమ్మలను సేకరించి వాటిని భక్తి శ్రద్ధలతో పూజించి అయ్యప్ప స్వామి వారి ఆదేశాల ప్రకారం వాటిని భక్తులకు ఇచ్చాడట అయ్యప్ప స్వామి వారి విగ్రహాన్ని తిరిగి ప్రతిష్టించే వరకు ఆ ముద్ర వాడిని భక్తులు ఆరాధించి అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం పొందారు.


ఇలా ఎంతో పరమపవిత్రమైన ముద్రవాడిని నేటి సమాజం ఒక అలంకార చిన్నంగా ఒక గొప్ప వ్యక్తి హోదాగా భావిస్తున్నారు కానీ అయ్యప్ప పూజా విధానం లో ముద్రవాడి  ప్రదానం చేయాలనే నిబంధన గాని దానిని భక్తులు స్వీకరించాలని గాని నియమం ఎక్కడా లేదు ఒకవేళ భక్తులకు ముద్రవాడి  ఇచ్చి దర్శన స్వీకరించాలని ఎవరు ప్రయత్నించినా అది కేవలం వ్యాపార ధోరణి విధానమే తప్ప అయ్యప్ప భక్తి మార్గం కాదు ముద్రవాడి విషయంలో  చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే స్వామివారి ఆగ్రహానికి గురికాక తప్పదు గుర్తించుకోండి స్వాములు.


ముద్రవాడి ,  అనుసరించాల్సిన పద్ధతులు?


ముద్రవాడి ప్రధానం చేయడం స్వీకరించడం చాలా కాలం క్రితం కేరళ భక్తుల్లో  సాంప్రదాయంగా ఉండేది తరువాత కొన్ని సంవత్సరాల వరకు ఆ సంప్రదాయం అంత ప్రాచుర్యంలో లేదు ఇటీవల కొన్ని సంవత్సరాలుగా ముద్రవాడి బహుకరణ సాంప్రదాయం ప్రారంభమైంది.


దీనిని ఒక హోదాగా అలంకారప్రాయంగా ఆధ్యాత్మిక అధికార దండంగా కొందరు భావిస్తున్నారు అలాగే దీనిని బహూకరించే గురు స్వాములు ప్రతిఫలంగా కట్నకానుకలు తీసుకుంటున్నారు.  ఈ రెండు అభిప్రాయాలు సరైనవి కావని ఇచ్చేవారు తీసుకునేవారు ఇద్దరిదీ పొరపాటేనని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను.


ముద్రవాడి అధికార చిన్నం కానేకాదు , అది అలంకార చిన్నం అంతకన్నా కానేకాదు

అది స్వీకరించిన వారికి మరింత ఆధ్యాత్మిక బాధ్యతలు పెరుగుతాయి.

అది స్వీకరించిన భక్తులు నిత్యము అయ్యప్ప భక్తులుగానే జీవించాలి.


అయ్యప్ప సీజన్లో మాత్రమే అయ్యప్పను  ఆరాధించి మిగతా సంవత్సరమంతా చాలామంది అయ్యప్ప ఆరాధన చేయరు

వారానికి ఒకటి రెండు సార్లు అయ్యప్ప ఆలయానికి వెళ్తారు ఇంట్లో కూడా స్వామి కి దండం పెట్టి తమ పనులు తాము చూసుకుంటారు

కానీ ముద్రవాడి స్వీకరించినవారు ఇంట్లో ప్రతి రోజు ఉదయం స్వామివారి మహిమ నిక్షిప్తమైన ముద్రవాడిని అయ్యప్ప స్వామివారిని ఆరాధించాలి.


ప్రతిరోజు ఉదయం చన్నీటి స్నానం చేసి పూజ చేయాలి. అలాగే రాత్రి నిద్రపోయే ముందు స్నానం చేసి దీపం వెలిగించి ముద్రవాడిని  కళ్ళకద్దుకుని స్వామివారి నమస్కార శ్లోకాలు పఠించాలి.


ఒకవేళ ముద్రవాడిని అయ్యప్ప స్వామి ఆలయంలో కనక ఉంచినట్లయితే తప్పనిసరిగా ప్రతి రోజు ఉదయం ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి *విషు సందర్భంగానూ మాస పూజలు సీజన్లో పూజలకు వెళ్ళినప్పుడు నల్లని దుస్తులు ధరించినప్పుడు మాత్రమే ముద్రవాడి నీ చేతిలో పట్టుకొని వెళ్ళాలి.* స్వామివారి కట్టుబాట్లను అమలు చేస్తూ ఆయన సేవలో మీరు ఉన్నారని ఇతరులు మీ ముద్రవాడిని చూసి గ్రహిస్తారు అలాగే ముద్ర వాడిని ప్రధానం చేసే గురు స్వాములు ముద్రవాడి ప్రధానం చేసినందుకు మీరు ఏ రూపేనా ధనం గాని ప్రతిఫలం గాని ఆశించకూడదు.


అలా చేస్తే *ముద్రవాడి అనగా అయ్యప్ప స్వామివారి అంశ ను  అమ్మినట్లే*

దానికి కృతజ్ఞతగా గురుస్వామికి డబ్బులు బహుమతులు ఇస్తే అది అయ్యప్ప స్వామి వారి అంశను  కొన్నట్లు అవుతుంది.  *ఇది మహా అపచారం మనం కేవలం మానవమాత్రులము  మనం అయ్యప్ప స్వామి వారి మూల పురుషుడైన మహిమాన్వితుడైన  శ్రీ ధర్మశాస్తాను అమ్మగలమా కొనగలమా అది ఎంత  తప్పు అప్పుడు మనము స్వామివారి శాపానికి గురి అవుతాము* కానీ ఆయన ప్రేమను నోచుకోము.  కొందరు గురు స్వాములు ముద్రవాడి  పేరు మీద కర్రలు చేయించి దాన్ని శిష్యులకు ఇచ్చి వేరే రూపాన ప్రతిఫలం పొందుతున్నారు అలా ఎంతమాత్రం చేయకూడదు నీ రూపేనా అది తీసుకున్న డబ్బు గానీ ఇతర బహుమతులు గానీ ఇస్తే ఆ ముద్రవాడి మహిమ నశించి మామూలు కర్రముక్క గానే మిగిలిపోతుంది. మామూలు కర్ర ముక్కలను ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు అలా కర్రలు ఇచ్చి ప్రతిఫలం పొందేవాళ్ళు కర్ర ముక్కలను అమ్ముకుని  వ్యాపారులు అవుతారు కానీ పవిత్రమైన ముద్రవాడి  ఇచ్చే గురుస్వాములు కారు కదా.


నిజానికి స్వచ్ఛమైన కర్రలు మనకు కేరళలో శబరిమల ప్రాంతంలో ఉన్న అడవుల్లో లభిస్తాయి. అక్కడ గతంలో ముద్రవాడి ప్రధానం చేసే వాళ్ళకి కొన్ని నిబంధనలు ఉండేవి శిష్యుడికి ముద్రవాడి ప్రధానం చేయి తలుచుకున్న గురు స్వామి శుభ్రంగా స్నానం పూజాదులు ముగించి ఈ కర్ర అన్వేషణకు వెళ్లేవారు సహజమైన కర్ర చివర్లో ఒక ముడి కలిగి ఉంటుంది ఈ ముడి అయ్యప్ప స్వరూపంగా భావిస్తారు ఈ కర్ర తెచ్చిన తరువాత గురుస్వామి మండల రోజులపాటు దీక్షలో ఉండి అయ్యప్ప ఆరాధన చేస్తారు.

ముద్ర వాడిని ఎవరికి ఇవ్వదలచుకున్నాడో  ఆ శిష్యునికి ఈ విషయం తెలియజేస్తారు.

ఆ శిష్యుడు కూడా స్వీకరించడానికి వీలుగా మండలం రోజులపాటు దీక్ష లో ఉంటాడు తర్వాత శిష్యుడు తన ఇంట్లో చిన్న పూజా కార్యక్రమం నిర్వహించాలి దీనినే ముద్రవాడి  ప్రధానోత్సవం గా భావిస్తారు పదిమంది అయ్యప్ప స్వామి భక్తులను ఈ వేడుకకు ఆహ్వానిస్తారు అప్పుడు గురుస్వామి ఈ *ముద్రవాడి  విశిష్టతను* వివరిస్తాడు

దీనిని స్వీకరించిన శిష్యుడికి పాటించవలసిన నియమాలు గురించి చెబుతాడు ఆ తర్వాత అక్కడికి చేరిన వారందరూ శరణు ఘోష పలుకుతారు.


శరణుఘోష ముగిసిన తర్వాత గురువుగారు అందరి సమక్షంలో ముద్ర వాడిని శిష్యుడికి ప్రధానం చేస్తూ నేను ఎంతో భయభక్తులతో అయ్యప్ప శరణు కోరుతూ ఆయన ఆదేశం మేరకు ఈ ముద్రవాడిని నా శిష్యుడికి ప్రధానం చేస్తున్నాను దీనిని స్వీకరించిన ఇతడు త్రికరణశుద్ధితో అయ్యప్ప స్వామి వారిని ఆరాధిస్తూ ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుతున్నాను అని ముద్రవాడి దండమును అందిస్తాడు.


దీనిని స్వీకరించిన శిష్యుడు గురువు గారు ప్రధానం చేసిన అయ్యప్పస్వామి ముద్రవాడిని మిక్కిలి భయభక్తులతో స్వీకరిస్తున్నాను , ఈ ముద్రవాడిని కలిగిన నేను నా జీవితమంతా త్రికరణశుద్ధిగా అయ్యప్పస్వామి భక్తుడనై మిగతా అయ్యప్ప భక్తులకు ఆదర్శప్రాయంగా నడుచుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటాడు.

ముద్రవాడి  ప్రధానం జరిగిన తర్వాత శిష్యులు సిద్ధం చేయించిన భోజనాన్ని ప్రసాదంగా భిక్షగా అక్కడికి హాజరైన వారు భుజిస్తారు ఈ సందర్భంగా గురువు గారికి శిష్యుడు నూతన వస్త్రం సమర్పించుకుంటాడు.


ఈ ముద్రవాడి ప్రధానోత్సవం *అయ్యప్పస్వామి వారి జన్మ దినోత్సవం నాడు గాని విషు నాడు గాని బహుకరించాలి*.


*డిసెంబర్ జనవరి నెలల్లో అయ్యప్ప దీక్ష సందర్భంగా జరిగే పూజల్లో ఈ ముద్రవాడిని స్వీకరించకూడదు , ప్రధానం చేయకూడదు. ఎందుకంటే ఆ దీక్ష రోజుల్లో మాలాధారణ చేసిన వారే సాక్షాత్తు అయ్యప్ప స్వరూపులు అవుతారు. తర్వాత వారు యాత్ర చేసి అయ్యప్ప సన్నిధానం చేరుతారు సాక్షాత్తూ స్వామి జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు.  నిరంతరం సతతం అయ్యప్పస్వామి తోడుగా ఉండి ఆయన సన్నిధానంలో భక్తులకు దర్శనమిచ్చి జ్యోతిరూపంలో ప్రత్యక్షమౌతాడు కనుక ఆ సందర్భంలో ముద్రవాడి  ప్రధానము  నిషిద్ధం అని కేరళ లోని కొందరు గురు స్వాములు భక్తులు చెప్పారు.*


ముద్రవాడి బహుకరణకు స్వీకరణకు ఇంత తతంగం ఉండగా కొందరు గురు స్వాములు తమ ఇష్టం వచ్చినప్పుడు తమ ఇష్టం వచ్చిన వారికి ఈ *ముద్రవాడిని* ఇవ్వడం శిష్యులు దీన్ని ప్రాధాన్యతను గుర్తించకుండా స్వీకరించి దీనిని ఏం చేయాలో తెలియక మదన పడటం జరుగుతుంది.


శిష్యులు ప్రేమతో భక్తితో తమ గురువులకు ముద్రవాడి బహూకరించవచ్చు. గురువు ఎల్లప్పుడూ తమకు గురువే అయ్యప్ప స్వామి భక్తి మార్గంలో తమను నడిపించాలని స్వామి ప్రార్ధిస్తూ గురుస్వామికి ఇవ్వవచ్చు. అందులో ఎటువంటి ఆక్షేపణ లేదు ముద్రవాడి  పై ముడి  గాక 18 ముడులు చెక్కుతారు ఇవి పదునెట్టాంబడికి విశిష్ట అష్టాదశ సూత్రాలకు అష్టాదశ పురాణాలకి సంకేతం.


ఈ ముద్రవాడి స్వీకరించిన భక్తులు తప్పకుండా 18 సంవత్సరాలు అయ్యప్ప దీక్ష తీసుకొని యాత్ర చేయాలి మధ్యలో ఒక్కసారి కూడా మానకూడదు

మన అయ్యప్ప ఆరాధన క్రమంలో ముద్రవాడికి ఎంతో విశిష్టత  స్థానం ఉంది సమర్ధుడైన సద్గురువు ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా దానిని ప్రసాదించినాడు నిష్ఠతో దానిని స్వీకరించ గలగడం పూర్వజన్మ సుకృతంగా భావించాలి. అంతేగాని ఎప్పుడు బడితే అప్పుడు ఏ సంప్రదాయం పాటించకుండా ముద్రవాడులను బహూకరిస్తారు.  అలాంటి ముద్రవాడులకు స్వీకరించిన భక్తులకు ఫలితం ఉండదు


ముద్రవడి అనుసరించాల్సిన పద్ధతులు? 


 ముద్ర పడి ప్రధానం చేయడం స్వీకరించడం చాలా కాలం క్రితం కేరళ భక్తుల్లో  సాంప్రదాయంగా ఉండేది తరువాత కొన్ని సంవత్సరాల వరకు ఆ సంప్రదాయం అంత ప్రాచుర్యంలో లేదు ఇటీవల కొన్ని సంవత్సరాలుగా ముద్ర వడి బహుకరణ సాంప్రదాయం ప్రారంభమైంది

 దీనిని ఒక హోదాగా అలంకారప్రాయంగా ఆధ్యాత్మిక అధికార దండంగా కొందరు భావిస్తున్నారు అలాగే దీనిని బహూకరించే గురు స్వాములు ప్రతిఫలంగా కట్నకానుకలు తీసుకుంటున్నారు ఈ రెండు అభిప్రాయాలు సరైనవి కావని ఇచ్చేవారు తీసుకునేవారు ఇద్దరిదీ పొరపాటేనని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను


 ముద్ర వడి అధికార చిన్నం కానేకాదు

 అది అలంకార చిన్నం అంతకన్నా కానేకాదు

 అది స్వీకరించిన వారికి మరింత ఆధ్యాత్మిక బాధ్యతలు పెరుగుతాయి

 అది స్వీకరించిన భక్తులు నిత్యము అయ్యప్ప భక్తులు లాగానే జీవించాలి

 అయ్యప్ప సీజన్లో మాత్రమే అయ్యప్పను  ఆరాధించి మిగతా సంవత్సరమంతా చాలామంది అయ్యప్ప ఆరాధన చేయరు

 వారానికి ఒకటి రెండు సార్లు అయ్యప్ప ఆలయానికి వెళ్తారు ఇంట్లో కూడా స్వామి కి దండం పెట్టి తమ పనులు తాము చూసుకుంటారు

 కానీ ముద్ర వాడి స్వీకరించినవారు ఇంట్లో ప్రతి రోజు ఉదయం స్వామివారి మహిమ నిక్షిప్తమైన ముద్ర వాడిని అయ్యప్ప స్వామివారిని ఆరాధించాలి

 ప్రతిరోజు ఉదయం చన్నీటి స్నానం చేసి పూజ చేయాలి

 అలాగే రాత్రి నిద్రపోయే ముందు స్నానం చేసి దీపం వెలిగించి ముద్ర వాడిని  కళ్ళకద్దుకుని స్వామివారి నమస్కారం శ్లోకాలు పఠించాలి


 ఒకవేళ ముద్రపడిన అయ్యప్ప స్వామి ఆలయంలో కనక ఉంచినట్లయితే తప్పనిసరిగా ప్రతి రోజు ఉదయం ఆలయానికి వెళ్ళి పూజ చేయాలి విషు సందర్భంగానూ మాస పూజలు సీజన్లో పూజలకు వెళ్ళినప్పుడు నల్లని దుస్తులు ధరించినప్పుడు మాత్రమే ముద్ర పడి నీ చేతిలో పట్టుకొని వెళ్ళాలి స్వామివారి కట్టుబాట్లను అమలు చేస్తూ ఆయన సేవలో మీరు ఉన్నారని ఇతరులు మీ ముద్ర వాడిని చూసి గ్రహిస్తారు అలాగే ముద్ర వాడిని ప్రధానం చేసే గురు స్వాములు ముద్ర వాడి ప్రధానం చేసినందుకు మీరు ఏ రూపేనా ధనం గాని ప్రతిఫలం గాని ఆశించకూడదు

 అలా చేస్తే ముద్ర వాడి అనగా అయ్యప్ప స్వామివారి అంశ ను  అమ్మినట్లే

 దానికి కృతజ్ఞతగా గురుస్వామికి డబ్బులు బహుమతులు ఇస్తే అది అయ్యప్ప స్వామి వారి అంశను  కొన్నట్లుఅవుతుంది

 ఇది మహా అపచారం మనం కేవలం మానవమాత్రులము 

 మనం అయ్యప్ప స్వామి వారి మూల పురుషుడైన మహిమాన్వితుడైన శ్రీ ధర్మ శాస్త్రను  అమ్మ గలమా కొనగలవా అది ఎంత తప్పు అప్పుడు మనము స్వామివారి శాపానికి గురి అవుతాము  కానీ ఆయన ప్రేమను నోచుకోము

 కొందరు గురు స్వాములు ముద్ర వడి పేరుమీద కర్రలు చేయించి దాన్ని శిష్యులకు ఇచ్చి వేరే రూపాన ప్రతిఫలం పొందుతున్నారు అలా ఎంతమాత్రం చేయకూడదు నీ రూపేనా అది తీసుకున్న డబ్బు గానీ ఇతర బహుమతులు గానీ ఇస్తే ఆ ముద్ర వడి మహిమ నశించి మామూలు కర్రముక్క గానే మిగిలిపోతుంది

 మామూలు కర్ర ముక్కలను ఇంట్లో పెట్టుకోవడం ఎందుకు అలా కర్రలు ఇచ్చి ప్రతిఫలం పొందేవాళ్ళు కర్ర ముక్కలను అమ్ముకుని  వ్యాపారులు అవుతారు కానీ పవిత్రమైన ముద్ర వాడి  ఇచ్చే గురుస్వాములు కారు కదా


 నిజానికి స్వచ్ఛమైన కర్రలు మనకు కేరళలో శబరిమల ప్రాంతంలో ఉన్న అడవుల్లో లభిస్తాయి అక్కడ గతంలో ముద్ర వాడి ప్రధానం చేసే వాళ్ళకి కొన్ని నిబంధనలు ఉండేవి శిష్యుడికి ముద్ర వాడి ప్రధానం చేయి తలుచుకున్న గురు స్వామి శుభ్రంగా స్నానం పూజాదులు ముగించి ఈ కర్ర అన్వేషణకు వెళ్లేవారు సహజమైన కర్ర చివర్లో ఒక ముడి కలిగి ఉంటుంది ఈ ముడి అయ్యప్ప స్వరూపంగా భావిస్తారు ఈ కర్ర తెచ్చిన తరువాత గురుస్వామి మండల రోజులపాటు దీక్షలో ఉండి అయ్యప్ప ఆరాధన చేస్తారు

 ముద్ర వాడిని ఎవరికి ఇవ్వదలచుకున్నాడో  ఆ శిష్యునికి ఈ విషయం తెలియజేస్తారు

 ఆ శిష్యుడు కూడా స్వీకరించడానికి వీలుగా మండలం రోజులపాటు దీక్ష లో ఉంటాడు తర్వాత శిష్యుడు తన ఇంట్లో చిన్న పూజా కార్యక్రమం నిర్వహించాలి దీనినే ముద్ర వాడి  ప్రధానోత్సవం గా భావిస్తారు పదిమంది అయ్యప్ప స్వామి భక్తులను ఈ వేడుకకు ఆహ్వానిస్తారు అప్పుడు గురుస్వామి ఈ ముద్రవాడి  విశిష్టతను వివరిస్తాడు

 దీనిని స్వీకరించిన శిష్యుడికి పాటించవలసిన నియమాలు గురించి చెబుతాడు ఆ తర్వాత అక్కడికి చేరిన వారందరూ శరణు ఘోష పలుకుతారు


 శరణుఘోష ముగిసిన తర్వాత గురువుగారు అందరి సమక్షంలో ముద్ర వాడిని శిష్యుడికి ప్రధానం చేస్తూ నేను ఎంతో భయభక్తులతో అయ్యప్ప శరణు కోరుతూ ఆయన ఆదేశం మేరకు ఈ ముద్ర వారిని నా శిష్యుడికి ప్రధానం చేస్తున్నాను దీనిని స్వీకరించిన ఇతడు త్రికరణశుద్ధితో అయ్యప్ప స్వామి వారిని ఆరాధిస్తూ ఆదర్శప్రాయంగా ఉండాలని కోరుతున్నాను అని ముద్ర పడి దండం అందిస్తాడు


 దీనిని స్వీకరించిన శిష్యుడు గురువు గారు ప్రధానం చేసిన అయ్యప్పస్వామి ముద్ర వాడిని మిక్కిలి భయభక్తులతో స్వీకరిస్తున్నాను ఈ ముద్ర వాడిని కలిగిన నేను నా జీవితమంతా త్రికరణశుద్ధిగా అయ్యప్పస్వామి భక్తుడై మిగతా అయ్యప్ప భక్తులకు ఆదర్శప్రాయంగా నడుచుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను అంటాడు

 ముద్ర వడి  ప్రధానం జరిగిన తర్వాత శిష్యులు సిద్ధం చేయించిన భోజనాన్ని ప్రసాదంగా భిక్షగా అక్కడికి హాజరైన వారు భుజిస్తారు ఈ సందర్భంగా గురువు గారికి శిష్యుడు నూతన వస్త్రం సమర్పించుకుంటాడు


 ఈ ముద్ర వాడి ప్రధానోత్సవం అయ్యప్పస్వామి వారి జన్మ దినోత్సవం నాడు గాని విషు నాడు గాని బహుకరించాలి రాచర్ల రమేష్

 డిసెంబర్ జనవరి నెలల్లో అయ్యప్ప దీక్ష సందర్భంగా జరిగే పూజల్లో ఈ ముద్ర వాడిని స్వీకరించకూడదు

 ప్రధానం చేయకూడదు ఎందుకంటే ఆ దీక్ష  రోజుల్లో మాలాధారణ చేసిన వారే సాక్షాత్తు అయ్యప్ప స్వరూపులు అవుతారు తర్వాత వారు యాత్ర చేసి అయ్యప్ప సన్నిధానం చేరుతారు సాక్షాత్తూ స్వామి జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు

 నిరంతరం సతతం అయ్యప్పస్వామి తోడుగా ఉండి ఆయన సన్నిధానంలో భక్తులకు దర్శనమిచ్చి జ్యోతిరూపంలో ప్రత్యక్షమౌతాడు కనుక ఆ సందర్భంలో ముద్ర వడి  ప్రధానము  నిషిద్ధం అని కేరళ లోని కొందరు గురు స్వాములు భక్తులు చెప్పారు రాచర్ల రమేష్

 ముద్ర వడి బహుకరణ కు స్వీకరణకు ఇంత తతంగం ఉండగా కొందరు గురు స్వాములు తమ ఇష్టం వచ్చినప్పుడు తమ ఇష్టం వచ్చిన వారికి ఈ ముద్ర వాడిని ఇవ్వడం శిష్యులు దీన్ని ప్రాధాన్యతను గుర్తించకుండా స్వీకరించి దీనిని ఏం చేయాలో తెలియక మదన పడటం జరుగుతుంది

 శిష్యులు ప్రేమతో భక్తితో తమ గురువులకు ముద్ర పడి బహూకరించవచ్చు గురువు ఎల్లప్పుడూ తమకు గురువే అయ్యప్ప స్వామి భక్తి మార్గంలో తమను నడిపించాలని స్వామి ప్రార్ధిస్తూ గురుస్వామికి ఇవ్వవచ్చు అందులో ఎటువంటి ఆక్షేపణ లేదు ముద్రవాడి  పై మూడి  గాక 18 మూడు చెక్కుతారు ఇవి పదునెట్టాంబడికి విశిష్ట అష్టాదశ సూత్రాలకు అష్టాదశ పురాణాలకి సంకేతం

 ఈ ముద్ర వాడి స్వీకరించిన భక్తులు తప్పకుండా 18 సంవత్సరాలు అయ్యప్ప దీక్ష తీసుకొని యాత్ర చేయాలి మధ్యలో ఒక్కసారి కూడా మానకూడదు

 మన అయ్యప్ప ఆరాధన క్రమంలో ముద్ర వాడికి ఎంతో విశిష్ట స్థానం ఉంది సమర్ధుడైన సద్గురువు ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా దానిని ప్రసాదించినాడు నిష్ఠతో దానిని స్వీకరించ గలగడం పూర్వజన్మ సుకృతంగా భావించాలి అంతేగాని ఎప్పుడు బడితే అప్పుడు ఏ సంప్రదాయం పాటించకుండా ముద్ర వడులను బహూకరిస్తారు ఉంటే అలాంటి ముద్ర వాడులకు స్వీకరించిన భక్తులకు ఫలితం ఉండదు మనము ఇదివరకే ముద్ర వాడి పరమార్ధం గురించి తెలుసుకుంన్నాం.




#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat