పురుషునికి 60 సంవత్సరాల వయసులో షష్టిపూర్తి మరియు 80 సంవత్సరాల వయసులో సహస్ర చంద్ర దర్శన శాంతి
చేయడం మనం సర్వ సాధారణంగా చూస్తుంటాము. కాని భాస్కరభట్టు అభిప్రాయం ప్రకారం 50 సంవత్సరాల వయసు మొదలుకొని ప్రతి 5 సంవత్సరాలకు అరిష్టం తొలగిపోవడానికి వయోవస్థా శాంతులు జరిపించాలి. వాటి వివరాలు క్రింద తెలిపినట్లుగా...
1. వైష్ణవీ శాంతి ::50 వ సంవత్సరము
వారుణీ శాంతి ::55 వ సంవత్సరము
3. ఉగ్రరథ శాంతి :- 60వ సంవత్సరము
4. మృత్యుంజయ శాంతి :- 65 వ సంవత్సరము
5. భౌమరథీ శాంతి :- 70 వ సంవత్సరము
6. ఐంద్రీ శాంతి: 75వ సంవత్సరము
7. సహస్ర చంద్ర దర్శన శాంతి :- 80 వ సంవత్సరము 8. రౌద్రీ శాంతి :- 85వ సంవత్సరము
9. కాలస్వరూప శౌరి శాంతి :- 90 వ సంవత్సరము
10. త్రయంబక మహారథి శాంతి :- 95వ సంవత్సరము
11. శతాబ్ది : మహామృత్యుంజయ శాంతి :-
100 వ సంవత్సరము