తిథులలో 13 వ తిథి త్రయోదశి , 13 వ సంఖ్య అత్యంత శుభకరం*_

P Madhav Kumar

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

పదమూడు సంఖ్య మంచిది కాదని పాశ్చాత్యుల నమ్మకం. కానీ భారతీయ సంప్రదాయంలో పదమూడవ తిథి మంచిరోజు.
తిథులలో పదమూడవ తిథి త్రయోదశి. ప్రతి నెలలోనూ రెండుసార్లు అంటే కృష్ణపక్షంలో ఒకసారి , శుక్లపక్షంలో ఒకసారి వస్తుంది. ఆ విధంగా సంవత్సరానికి ఇరవై నాలుగుసార్లు వస్తుందన్నమాట. ఈ తిథికి అధిపతి మన్మథుడు.
ప్రతి తిథిలోనూ మనం ఏదో ఒక పండుగను ఆచరిస్తాం. కానీ ఈ తిథిలో ఏ పండుగలూ లేవు. అందుకే ఇది శనీశ్వరుని సొంతమైనది. ఈయన ప్రభావం ఈ తిథిపై ఉంటుంది. కాబట్టే దీనిని శని త్రయోదశి అని అంటారు. ఈ తిథిలో ప్రయాణం శుభ ఫలితాలనిస్తుంది. తిథి ఫలం శుభం కాబట్టి ఈ తిథి రోజున వంకాయ తినకూడదు.

*త్రయోదశి గాయత్రి మంత్రం*

*ఓం మనోజాతాయై విద్మహే అనంగాయై:|*
*ధీమహి తన్నో: త్రయోదశి ప్రచోదయాత్‌||*

*ప్రతి త్రయోదశికి ఆచరించవలసిన విషయాలను పరిశీలిద్దాం.*

ఛైత్ర శుద్ధ త్రయోదశి - దీనికే అనంగ త్రయోదశి అనీ , మన్మథ త్రయోదశి , మదన త్రయోదశి అనీ పేరు. మన్మథుడు అతి సౌందర్యవంతుడు. మన్మథుడి వాహనం చిలుక. పుష్పాలే అయన బాణాలు. ప్రేమకు అధిదేవత.

*శరీర దాత , శాప ప్రదాత ఒక్కరే :*
మన్మథుడు బ్రహ్మదేవుని హృదయంలో నుంచి జన్మించాడు. ఆయన భార్య రతీదేవి బ్రహ్మదేవుని ఎడమ భాగం నుంచి జన్మించింది. ఆయనకు జన్మను ప్రసాదించిన బ్రహ్మదేవుడే ఆయనకు శాపమిచ్చాడు. ఆ శాప ప్రభావంవల్లనే ఆయన తన శరీరాన్ని కోల్పోయాడు. రతీ మన్మథులు అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలు. వారిని పూజిస్తే దాంపత్య సుఖం ప్రాప్తిస్తుంది. ఈ త్రయోదశికే *'కామదేవ త్రయోదశి'* అని మరో పేరుకూడా ఉంది , ఆ రోజున దవనంతో శివుడిని పూజిస్తే చాలా మంచి ఫలితం లభిస్తుందని *స్మృతి కౌస్తుభంలో* చెప్పబడింది. 

*వరాహ జయంతిపై తర్జనభర్జనలు :*
ఛైత్రబహుళ త్రయోదశి - ఈ రోజున వరాహ జయంతి. దశావతారాలలో మూడవది ఈ అవతారం. ఈ విషయం మీద పండితులలో చిన్న భేదాభిప్రాయం ఉంది. ఛైత్ర బహుళ నవమి అని కొంతమంది అంటుంటారు. కానీ పంచాంగ కర్తలు మాత్రం ఛైత్ర బహుళ త్రయోదశినే *'వరాహ జయంతి'గా* పేన్కొంటాయి.

వైశాఖ శుద్ధ , బహుళ త్రయోదశిలకు ప్రత్యేకతలేమీ లేవు.

జ్యేష్ట శుద్ధ త్రయోదశి - రంభా త్రిరాత్ర వ్రతం. ఆరోజున అరటి చెట్టుకింద ఉమామహేశ్వరుల పూజచేస్తారు. కానీ ఇది అంతగా ఆచరణలో లేదు. 

*సున్ని ఉండలు నైవేద్యం :*
శ్రావణ శుద్ధ త్రయోదశి - అనంగ త్రయోదశి వ్రతం. రతీమన్మథులకు ఎర్రరంగా పుష్పాలు , కుంకుమ కలిపిన అక్షతలను ఉపయోగించాలి. మినుములు , బెల్లం , నేయి కలిపిన పదార్థాన్ని నైవేద్యంగా పెడతారు. పాలనుకూడా పెడతారు. మైనపువత్తితో హారతి ఇస్తారని పెద్దల చెబుతారు.

ఆశ్వయుజ బహుళ త్రయోదశి - 
ధన త్రయోదశి , ఇది దీపావళి పండుగకి రెండు రోజుల ముందు వస్తుంది. ఆరోజు నుంచీ దీపాలు పెడతారు. లక్ష్మీపూజ చేస్తారు.

కార్తీక బహుళ త్రయోదశి - దీపదానం శ్రేష్టం. 
మార్గశిర శుద్ధత్రయోదశి- అనంగ త్రయోదశి వ్రతం మంచిది.

*యమ దర్శన త్రయోదశి :*
మార్గశిర కృష్ణ త్రయోదశి - దీనిని యమదర్శన త్రయోదశి అంటారని చాతుర్వర్గ చింతామణిలో చెప్పబడింది.

మాఘ శుక్ల త్రయోదశి - విశ్వకర్మ జయంతి. విశ్వకర్మ దేవశిల్పి. గొప్ప వాస్తు శాస్త్రజ్ఞుడు.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat