#కార్తికేయుని 28 నామములు.............!!
1. యోగీశ్వరః – యోగీశ్వరులకు అధిపతి
2. మహాసేనః – దేవసైన్యానికి అధిపతి, దేవసేనాపతి
3. కార్తికేయః – ఆరు కృత్తికా నక్షత్రములచే పోషింపబడిన వాడు
4. అగ్నినన్దనః – పరమశివుని జ్ఞానాగ్ని నుంచి ఉద్భవించినవాడు మరియు
పరమశివుని తేజస్సు కొంత సేపు భరించినందువల్ల,
అగ్ని దేవునికి కూడా తనయుడిగా పిలువబడినవాడు.
5. స్కందః – పరమశివుని తేజస్సు నుండి జన్మించినవాడు
6. కుమారః – కుమార అన్న నామం కేవలం సుబ్రహ్మణ్యునికే చెందినది.
ఎందుకంటే, జగత్తుకి మాతా పితలు అయిన పార్వతీ పరమేశ్వరుల అన్యోన్యతకి ఫలం మన బుజ్జి సుబ్రహ్మణ్యుడు.
7. సేనానీః – దేవసేనలకు అధిపతి, దేవసేనాధ్యుక్షుడు.
8. స్వామీ శంకరసంభవః – శంకరుని దివ్యమైన తేజస్సు నుండి పుట్టినవాడు.
9. గాంగేయః – పరమశివుని తేజస్సు అగ్నిదేవుడు భరించలేక, గంగా మాతకి ఇచ్చేస్తే,
గంగా మాత కొంత సేపు శివుని తేజస్సును భరిస్తుంది. అందువల్ల, గంగా మాతకి కూడా పుత్రునిగా పిలబడ్డవాడు కాబట్టి గాంగేయ అనే నామం వచ్చింది.
10. తామ్రచూడః – కుక్కుటమును అధిరోహించిన వాడు.
11. బ్రహ్మచారీ – ఎల్లప్పుడూ బ్రహ్మనందు రమించువాడు.
12. శిఖిధ్వజః – అగ్ని ధ్వజముగా కలవాడు
13. తారకారిః – తారకాసురడనే రాక్షస సంహారము చేయుటకు అవతారం దాల్చిన వాడు,
తారకాసురుడిని, ఇతర రాక్షస గణములను సంహరించి దేవతలను రక్షించినవాడు.
14. ఉమాపుత్రః – ఉమాదేవి, అంటే పార్వతీ అమ్మ వారి ముద్దుల తనయుడు.
అందుకే సుబ్రహ్మణ్య స్వామి వారు అచ్చం అమ్మవారి లానే ఉంటారు.
15. క్రౌంచారిః – పర్వత రూపములో ఉన్న క్రౌంచ అనే రాక్షసుడిని సంహరించినవాడు.
16. షడాననః – ఆరు ముఖములు గలవాడు.
17. శబ్దబ్రహ్మసముద్రః – జ్ఞాన స్వరూపుడు, అంటే వేదములు ఏ పరబ్రహ్మ స్వరూపమును గురించి ఘోషిస్తున్నాయో, ఆ వేద శబ్దములచే ప్రతిపాదించబడిన వాడు.
18. సిద్ధః – పరిపూర్ణ సిద్ధ స్వరూపుడు
19. సారస్వతః – సరస్వతీ స్వరూపము, అంటే జ్ఞాన స్వరూపము.
20. గుహః – సకలజీవుల హృదయ గుహలో కొలువై ఉన్నవాడు.
21. భగవాన్ సనత్కుమారః – చతుర్ముఖ బ్రహ్మ గారి నలుగురు మానస పుత్రులలో ఒకరైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారు.
ఈ విషయమే, త్రిపురా రహస్యంలో మాహాత్మ్యఖండంలో వివరించబడినదని, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిర్ధారించారు.
22. భోగమోక్షఫలప్రదః – ఈ భూమి మీద మనం సుఖంగా జీవించడానికి అవసరమైన సంపదతో పాటు అంత్యమునందు మోక్షమును కూడా ఇవ్వగలిగినవాడు.
23. శరజన్మా – శరవణతటాకము (రెల్లు పొదల) నుండి జన్మించినవాడు.
24. గణాధీశః – సకల దేవతలకు, గణములకు అధిపతి అయిన వాడు.
25. పూర్వజః – అందరికన్నా ముందున్నవాడు,
అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు, కేవలం ఒక అవతారం మాత్రమే కాదు,
ఎప్పుడూ ఉండే పరబ్రహ్మ స్వరూపం.
ఆయన ఎప్పుడూ ఉన్నవాడు, పుట్టుక లేనివాడు.
26. ముక్తిమార్గకృత్ – ముక్తి మార్గమును బోధించే గురు స్వరూపం. అంత్యమున ముక్తిని ప్రసాదించి,
తనలో కలుపుకునే స్వామి.
27. సర్వాగమప్రణేతా – సకల ఆగమములకు మూలము.
28. వాంచితార్ధప్రదర్శనః – అభీష్టములను నెరవేర్చే తండ్రి.
స్కంద ఉవాచ-
ఈ ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రము రుద్రయమల తంత్రములోనిది.
ఎవరైతే ఈ 28 నామములు ప్రతీ దినం ప్రాతః కాలం
భక్తి శ్రద్ధలతో చదువుతారో,
వారు సరస్వతీ అనుగ్రహం పొంది,
చక్కని తెలివితేటలు, మంచి వాక్కు మరియు
జ్ఞానమును పొందుతారు.
సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు..!
లోకా సమస్తా సుఖినోభవంతు..!🙏🙏🙏
#అందరికి నాగుల చవితి శుభాకాంక్షలు